వాలంటీర్ల బాస్ ఎవరని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అమరావతి: వాలంటీర్ల బాస్ ఎవరని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.ప్రజల డేటా సేకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రైవేట్ కంపెనీకి డేటా ఇవ్వడానికిఎవరు అనుమతించారని ఆయన ప్రశ్నించారు. ప్రజల డేటా సేకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యక్తిగత సమాచారం సేకరించాలని ఎవరు అనుమతి ఇచ్చారన్నారు.ప్రజల వ్యక్తిగత డేటా వెళ్తున్న ఆ ప్రైవేట్ కంపెనీలు ఎవరివని ఆయన అడిగారు. వైజాగ్ లో ఎలాంటి ఐడీ కార్డ్ లేకుండా ఒక యువతి వాలంటీర్ పేరుతో డేటా సేకరిస్తుండగా పట్టుకున్న వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత, గారు డేటా లీకేజీ అంశంపై నిజాలు బయటపెట్టడంతో ప్రశ్నించడంతో మొదలుపెట్టిన ప్రజలు.
త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు పై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్దంగా ఉండు జగన్… pic.twitter.com/T7yuV6WUZz
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్లు దోహదపడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ పై పలువురు మంత్రులు, వైసీపీ నేతలు మండిపడ్డారు. ఇవాళ నెల్లూరు జరిగిన సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు