అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ !

Pawan Kalyan : విజయవాడ-హైదరాబాద్ హైవేపై హైటెన్షన్ నెలకొంది. అనుమంచిపల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.  

Google News Follow Us

Pawan Kalyan: విజయవాడ-హైదరాబాద్ హైవేపై హైటెన్షన్ నెలకొంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెకోపోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన జనసైనికులు వాటిని  తొలగించారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 

ఇదిలా ఉంటే.. అనుమంచిపల్లి దగ్గర మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో తీసుకు వెళ్తున్నారు. అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సమాచారం పోలీసులు ఇవ్వలేదు అని జనసేన ట్విట్ చేసింది. 

ఈ క్రమంలో తాను వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు..  అనుంచిపల్లి వద్దకు అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. ఉన్నతాధికారులు వచ్చాక మంగళగిరికి పంపించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Read more Articles on