
టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి విజయవాడ బయలుదేరారు. ఈ క్రమంలో విమానాశ్రయానికి బయలుదేరగా అక్కడి అధికారులు ఆయనకు అనుమతించలేదు. దీంతో కారులో బయలుదేరిన పవన్ కళ్యాణ్ ను ఈ ఎన్టీఆర్ గరికపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అక్కడే రోడ్డుపై పడుకుని నిరసనకు దిగారు. ఈ క్రమంలో గరికపాడు వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కు రావాలంటే వీసా పాస్‌పోర్టు కావాలేమో అంటూ మండిపడ్డారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన పవన్ అక్కడే రోడ్డుపై పడుకుని నిరసనకు దిగారు. కాలినడక అయినా మంగళగిరి చేరుకోవాలని పవన్ నిర్ణయించినట్టు సమాచారం.
టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఏ తప్పు చెయ్యని నాయకులను జైల్లో పెట్టి వేధించడం అన్యాయమన్నారు. చంద్రబాబు పట్ల పోలీసులు వివరించిన తీరును పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎలాంటి ఆధార లేకుండా.. చంద్రబాబును అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడం సరికాదని అన్నారు.