అభ్యర్థుల ఎంపికకు జనసేన రెడీ: స్క్రీనింగ్ కమిటీ వేసిన పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Feb 2, 2019, 7:46 PM IST
Highlights

2019 ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫైనల్ రిపోర్ట్ ను జనరల్ బాడీకి సమర్పించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని కూడా ఆదేశించింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేష్ విడుదల కాబోతుంది. ఎన్నికల సైరన్ మోగనున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. అభ్యర్థుల ఎంపికకు ఆయా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. 

ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా అటు జనసేన సైతం అభ్యర్థులను ప్రకటించేసింది. ఇకపోతే జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపికలో మరింత జోరు పెంచనుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించింది. 

అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఐదుగురు సభ్యులతో  కూడిన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ సీనియర్ నేతలు మాదాసు గంగాధరం, మీడియా కో ఆర్డినేటర్ హరిప్రసాద్, మహేందర్ రెడ్డి, శివశంకర్, హరహం ఖాన్ లను స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా నియమించారు పవన్. 

2019 ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫైనల్ రిపోర్ట్ ను జనరల్ బాడీకి సమర్పించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని కూడా ఆదేశించింది. 

ఫిబ్రవరి రెండో వారం నుంచి విజయవాడ పార్టీ కార్యాలయం కేంద్రంగా కమిటీ పనిచేస్తుందని కూడా పవన్ స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తు పరిశీలన బాధ్యత స్క్రీనింగ్ కమిటీదేనని అయితే తుది నిర్ణయం మాత్రం జనరల్ బాడీకి ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.    

Screenings Committee Of JanaSena with Five Members pic.twitter.com/cxTRa7urRK

— JanaSena Party (@JanaSenaParty)

 

click me!