సూపర్ స్టార్ సోదరుడికి టీడీపీ ఎర: రంగంలోకి దిగిన తమ్ముళ్లు

By Nagaraju penumalaFirst Published Feb 2, 2019, 6:59 PM IST
Highlights

ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఆలపాటి రాజాలకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఈ బృందం ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా బుర్రి పాలెంలోని ఆది శేషగిరిరావు నివాసానికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించనుంది.  

అమరావతి: సినీనటుడు, నటశేఖర్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావుకు టీడీపీ గేలం వేస్తోంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావును తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఒక టీం ను కూడా ఏర్పాటు చేసింది టీడీపీ అధిష్టానం. 

ప్రస్తుతం ఆది శేషగిరిరావు గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు ఆదేశించారు. 

ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఆలపాటి రాజాలకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఈ బృందం ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా బుర్రి పాలెంలోని ఆది శేషగిరిరావు నివాసానికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించనుంది.  

ఇకపోతే ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. వైఎస్ జగన్ గుంటూరు పార్లమెంట్ స్థానం ఇచ్చేది లేదని విజయవాడ నుంచి పోటీ చెయ్యాలని సూచించారు. దీంతో మనస్థాపం చెందిన ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలో సైకిల్ ఎక్కబోతున్నారు.  

click me!