
గత ఎన్నికలలో పోటీ చేయనందుకు తాను చాలా బాధపడుతున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పట్లో బలమైన ప్రభుత్వం ఏర్పడడానికి ఓట్లు చీలరాదని తాను పోటీలో నిలబడలేదని చెప్పారు. కానీ ఆనాడు తాను చేసిన పనికి ఈ రోజు చింతిస్తున్నానని, బాధపడుతున్నానని అన్నారు. ఎందుకు తాను కొద్ది స్థానాల్లోనైనా పోటీచేయలేదే అని ఇప్పుడు చాలా బాధగాఉందని చెప్పారు. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ప్రభుత్వాలు అండగా నిలబడాలని ఆయన అన్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సైనికుడు కనబడతాడని, జైహింద్ అంటాడని చెప్పారు. వారికి స్ఫూర్తిగానే తాను ఈ రోజు మిలటరీ చొక్కాను వేసుకున్నట్టు వెల్లడించారు.