దుర్గమ్మ గుడిలో అపచారం.. అమ్మవారి చీర మాయం

First Published Aug 6, 2018, 11:03 AM IST
Highlights

సుమారు రూ.18 వేల విలువైన పట్టుచీరతోపాటు పూలు, పండ్లు, పూజా సామగ్రితో 300 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి చీరబహుకరించిన కొద్ది సేపటికే చీర మాయమైనట్లు గుర్తించారు

దుర్గమ్మ గుడిలో మరో అపచారం జరిగింది. దుర్గమ్మకు ఆషాఢ సారెలో సమర్పించిన రూ.18 వేల విలువైన పట్టుచీర ఆదివారం మాయమైంది. ఇంద్రకీలాద్రిపై మహామండపంలోని ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీరను అలంకరించిన పది నిమిషాల తర్వాత పట్టుచీర మాయం కావడంతో సారెను సమర్పించిన భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

 గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన లలితా మిగతా  పారాయణ భక్త బృందం సభ్యులు దుర్గమ్మకు సారెను సమర్పించారు.
సారెలో అమ్మవారికి సమర్పించేందుకు మదనపల్లిలో ప్రత్యేకంగా పట్టుచీరను నేత నేయించారు. సుమారు రూ.18 వేల విలువైన పట్టుచీరతోపాటు పూలు, పండ్లు, పూజా సామగ్రితో 300 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. 

అమ్మవారికి చీరబహుకరించిన కొద్ది సేపటికే చీర మాయమైనట్లు గుర్తించారు. దీంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిందేనని భక్తులు పట్టుపట్టారు. అయితే ఇప్పటి వరకు దీనిపై అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. 

click me!