కోటంరెడ్డి సంకట పరిస్థితి

First Published Feb 15, 2017, 9:47 AM IST
Highlights

పట్టాలిచ్చి అయిదేళ్లయినా ఇళ్ల స్థలాలు కనిపించడంలేదు,మీరయినా చూపించండంటున్న పేద మహిళలు

వైసిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఒకసంకట పరిస్థితి ఎదురయింది. ఈరోజు ఆయన ఈ రోజు 31వ డివిజన్ లోని శాంతినగర్, కొత్తూరులో పర్యటిస్తున్నపుడు పోలోమని మహిళలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే తమ దగ్గిర ఉన్న  ఇళ్లస్థలాల పట్టాలు చూపించి,  స్థలాలెక్కడ ఉన్నాయో చూపించమని వేడుకున్నారు. ఎపుడో కాంగ్రెస్ పట్టాలిచ్చింది. ఇపుడుటిడిపి ప్రభత్వం మనకేమిటి సంబంధం అన్నట్లుంది. ఫలితంగా ఈ పేద మహిళకు కాగితాలు  మిగిలాయి తప్ప, అందులో ఉన్న స్థలం దక్కడం లేదు. ఫలితంగా సొంత ఇల్లు కల భ్రమలాగా మిగిలిపోతున్నది.

 

ఈ పట్టాలిచ్చి అయిదేళ్లయిందని, తమకు ఈ స్థలాలెక్కడ ఉన్నాయో కనిపించడం లేదని, ఎమ్మెల్యేగా ఈ స్థలాలను చూపిస్తే సంతోషిస్తామని వేడుకున్నారు. ఆయన  పట్టాలను ఎగాదిగా చూసి  ఈ పట్టాలకు భూములు కేటాయించలేదని చెప్పారు. మరొక బృందం మహిళలది ఇంకొక సమస్య. వాళ్లకి స్థలాలు చూపించారుగాని అక్కడ జీవించడానికి ఎలాంటి ప్రాథమిక సౌకర్యాలులేవు. అక్కడికి పోయి ఇల్లు కట్టుకుని తామెలా జీవించాలో చెప్పాలని వేడుకున్నారు. నీళ్లు కరెంటు వసతి కల్పించకుండా తామె ఆ ప్రాంతంలో బతికేదెలా అని వాపోయారు.

 

ఈ పరిస్థితి మీద శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలిచ్చి అయిదేళ్లయిన స్థలాలు చూపించని అధికారుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి ఇళ్లస్థలాలు వచ్చేలా చూడటమేకాదు, అక్కడ నివాసానికి అనువయిన ప్రాథమిక వసతులను కల్పించేదాకా పోరాడతానని వారికి హామీ ఇచ్చాడు. అవసరమయితే ఈ సమస్యల మీద అధికారును కోర్టుకీడుస్తానని కూడా హెచ్చరించారు. జానెడుజాగా కోసం ప్రజలను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని చెబుతూ, అవసరమయితే ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా లేవదీస్తానని ఆయన చెప్పారు.

 

 

click me!