ఎన్నికల విషయంలో పార్టీ వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయి.. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది - జనసేన అధినేత పవన్ కల్యాణ్

By Asianet NewsFirst Published Mar 31, 2023, 10:38 AM IST
Highlights

ఎన్నికల కోసం జనసేన వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందకూడదని ఆయన పేర్కొన్నారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని పేర్కొన్నారు.

వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాలు క్లారిటీగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ అన్నారు. ఈ విషయంలో వైసీపీ మైండ్ గేమ్ అడుతోందని చెప్పారు. దానికి పార్టీ నాయకులు ఎవరూ లొంగిపోకూడదని తెలిపారు. త్వరలోనే ఈ విషయాలన్నీ అందరికీ అర్థమయ్యేలా వివరిస్తానని కొద్ది మంది పార్టీ నాయకులకు పవన్ కల్యాణ్ తెలియజేసినట్టు ‘ఈనాడు’ తన కథనంలో పేర్కొంది. హైదరాబాద్ లో కొంత మంది నాయకులతో ఆయన గురువారం సమావేశం అయ్యారు. అందులో ఈ విషయాలన్నీ వారికి తెలియజేశారు. దీనిపై జనసేన అధినేత పర్సనల్ పొలిటికల్ సెక్రటరీ పార్టీ నాయకులకు ఇంటర్నల్ గా నోట్ పంపించినట్టు తెలుస్తోంది.

బోయ, వాల్మీకీలను ఎస్టీలో చేర్చాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం: బంద్ నిర్వహిస్తున్న ఆదీవాసీలు

అందులో పార్టీ శ్రేణులెవరూ ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై అనవసరంగా టెన్షన్ పడొద్దని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, పార్టీ యువత భవిష్యత్తును ఆలోచించే జనసేన చీఫ్ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని వ్యాఖ్యానించారని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన నాటి నుంచి వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని తెలిపారు. పొత్తుల పేర్లతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. పార్టీలో గందరగోళం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందకూడదని, అనవసర గందరగోళానికి గురికాకూడదని పేర్కొన్నారు. త్వరలోనే పార్టీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలను జనసేన అధినేత తెలియజేస్తారని అందులో తెలిపారు.

సీఎం జగన్ మీద అసభ్యకర పోస్టులు... ప్రవాసాంధ్రుడి అరెస్ట్.. కోర్టు ఏమన్నదంటే..

కాగా.. గురువారం రైతుస్వరాజ్య వేదిక రాష్ట్రకమిటీ సభ్యులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయనతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కౌలురైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గ్రౌండ్ లెవెల్ చేసిన అధ్యయన నివేదికను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కౌలు రైతుల ఇబ్బందులకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణం అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రైతుల ఇబ్బందులపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దామని ఆయన ఆ కమిటీ సభ్యులకు తెలియజేశారు. 
 

click me!