సీఎం జగన్ మీద అసభ్యకర పోస్టులు... ప్రవాసాంధ్రుడి అరెస్ట్.. కోర్టు ఏమన్నదంటే..

By SumaBala BukkaFirst Published Mar 31, 2023, 10:06 AM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వం మీద అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఓ ప్రవాసాంధ్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

అమరావతి : కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు ఓ ప్రవాసాంద్రుడిని అరెస్టు చేశారు. అతని మీద ముఖ్యమంత్రి వైయస్ జగన్, వైసీపీ ప్రభుత్వం, పార్టీపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలు చేశారు. పొందూరు కోటిరత్న అంజన్ అనే ఈ ప్రవాసాంద్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోటిరత్న అంజన్ ను బుధవారం తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్నారు. కానీ గురువారం సాయంత్రం అదనపు జూనియర్ సివిల్ జడ్జి శిరీష ఎదుట హాజరు పరిచారు. నిందితుడైన అంజన్ సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా..  రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని తెలిపారు. అతనికి రిమాండ్ విధించాలని న్యాయమూర్తిని పోలీసులు కోరారు.

నిందితుడు తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఈ కేసులో రిమాండ్ అవసరం లేదని, నోటీసులు ఇస్తే సరిపోతుందని అన్నారు.  ఈ మేరకు లాయర్ గుడిపాటి లక్ష్మీనారాయణ నిందితుడు తరఫున తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించడానికి నిరాకరించారు.  రిమాండ్ విధించడానికి వీలు లేదంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  కోటి రత్నం అంజన్ గన్నవరానికి చెందిన వ్యక్తి. అమెరికాలో ఎమ్మెస్ చదువుకున్నాడు.  

మేకపాటి, వినయ్ మధ్య సవాళ్లు: ఉదయగిరి బస్టాండ్ వద్ద టెన్షన్, భారీగా పోలీసుల మోహరింపు

కొద్ది కాలం అక్కడే ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి గన్నవరంలోని తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 6 గంటల సమయంలో పోలీసులు గన్నవరం రాయ్ నగర్ లోని అతని నివాసం నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంజన్ మీద ఉల్లిపాయల కమీషన్ వ్యాపారి, వైసీపీ కార్యకర్త అయిన వంజరాపు నాగ సూర్య ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ ఫిర్యాదు మేరకు ఆంజనేయ ఐపీసీ సెక్షన్ 153 ఏ కింద  పోలీసులు కేసులు నమోదు చేశారు.  ఈ కేసు మేరకే అంజన్న అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని లాప్టాప్, ఫోన్, ట్యాబ్ లను గన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు.  

అంజన్ యువగళం అనే ట్విటర్ ఖాతాతో టీడీపీకి అనుకూలంగా పోస్టులు చేస్తున్నాడని.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానాలు పోస్టులు పెడుతున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. బుధవారం ఉదయం అంజన్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఉంగటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్నం పెదపారు పూడి స్టేషన్ కి  తీసుకెళ్లారు. ముఖ్యమంతి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  పోస్టులు పెట్టడం మీద..  టిడిపి నాయకులు కానీ, ఇతరుల ప్రమేయం కానీ ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు. ఇలా పోస్టులు పెట్టమని ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా?  అని ఆరా తీశారు.  ఇలా పోస్ట్ లు పెట్టడం వల్ల టిడిపి నుంచి నగదు ఏమైనా అందుతుందా అని కూడా ప్రశ్నించినట్లు  తెలుస్తోంది.

దీనికి అంజన్ సమాధానం చెబుతూ.. తాను వ్యక్తిగతంగానే అలాంటి పోస్టులు పెట్టినట్లు వివరించారు. దీంతో.. ఇకపై అలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దని పోలీసులు అంజన్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అదనపు జూనియర్ సివిల్ జడ్జి శిరీష నివాసానికి తీసుకెళ్లారు. నిందితుడిని ఆమె ఎదుట హాజరపరిచారు. పోలీస్ రిమాండ్ ఇవ్వాలని కోరారు. అంజన్ మీద పెట్టింది స్టేషన్ బెయిల్ సెక్షన్  కావడంతో.. అతని సొంత పూచికత్తుపై విడుదల చేయాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో అంజన్ హోమో సెక్సువల్ అని పేర్కొన్నారు. దీనిమీద కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా పేర్కొనడం సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడంలోకి ఇది వస్తుందని.. అంతేకాక ఇది చట్ట విరుద్ధమని న్యాయనిపుణులు అంటున్నారు. 

click me!