టీటీడీలో భారీ కుంభకోణం.. జగన్‌కు చెప్పడం లేదు: అధికారులపై పరిపూర్ణానంద ఆరోపణలు

By Siva KodatiFirst Published Apr 10, 2021, 8:19 PM IST
Highlights

గత ప్రభుత్వ హాయాంలో జరిగిన కుంభకోణంపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు మౌనంగా వుందని ప్రశ్నించారు పరిపూర్ణానంద స్వామిజీ. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీలో ఉన్న టిటిడికి సంబంధించిన అంశంలో నాలుగు కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

టిటిడి అనుబంధ సేవా సంస్థ కు అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అధికారిగా ఉన్నారని పరిపూర్ణానంద గుర్తుచేశారు. తెలుగుదేశం‌ హయాంలో  ఈ కుంభకోణం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రవీణ్ ప్రకాష్ కీలక అధికారిగా కొనసాగుతున్నారని పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు.

 Also Read:విష్ణుమూర్తి వ్యాఖ్యలు: శ్రీవారికి చేసినట్లు.. జగన్‌కూ పూజలు చేస్తారా, పరిపూర్ణానంద విమర్శలు

ఈ‌ కుంభకోణంపై సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సిఎం కార్యాలయ అధికారులు కూడా పట్టనట్లుగా ఉన్నారని పరిపూర్ణానంద ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణాలను కూడా అధికారులు అణచి పెడుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల గురించి జగన్మోహన్ రెడ్డి ఏమీ పట్టించుకోవడం లేదని... ఈ అక్రమాలు సిఎంకు తెలియకుండా దాచారని పరిపూర్ణానంద అనుమానం వ్యక్తం చేశారు. 

click me!