ఏపీలో పరిస్ధితి ఆందోళనకరం: ఒక్కరోజులో 3 వేలకు పైగా కేసులు.. చిత్తూరులో అత్యధికం

Siva Kodati |  
Published : Apr 10, 2021, 07:28 PM IST
ఏపీలో పరిస్ధితి ఆందోళనకరం: ఒక్కరోజులో 3 వేలకు పైగా కేసులు.. చిత్తూరులో అత్యధికం

సారాంశం

సెకండ్ వేవ్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై గట్టిగానో పడుతోంది. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ రాష్ట్రాలతో పోటీనిచ్చేలా ఏపీలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,309 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

సెకండ్ వేవ్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై గట్టిగానో పడుతోంది. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ రాష్ట్రాలతో పోటీనిచ్చేలా ఏపీలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,309 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.  

వీరితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 9,21,906కి చేరుకుంది. కోవిడ్ వల్ల నిన్న ఆంధ్రప్రదేశ్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ సోకి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,291కి చేరింది.

చిత్తూరులో ముగ్గురు, నెల్లూరు ఇద్దరు, విశాఖపట్నం ఇద్దరు, శ్రీకాకుళం ఇద్దరు, అనంతపూర్, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పన ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,053 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

వీరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్‌ల సంఖ్య 8,95,949కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,666 యాక్టీవ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజు  31,929 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు  నిర్వహించగా.. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం టెస్టుల సంఖ్య 1,53,97,672కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 133, చిత్తూరు 740, తూర్పుగోదావరి 111, గుంటూరు 527, కడప 124, కృష్ణ 278, కర్నూలు 296, నెల్లూరు 133, ప్రకాశం 174, శ్రీకాకుళం 279, విశాఖపట్నం 391, విజయనగరం 97, పశ్చిమ గోదావరిలలో 26 కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu