వైసీపీ గుండెల్లో రైళ్లు.. దొంగ ఓట్లను అడ్డుకోండి: తిరుపతిలో గెలుపు మనదే, చంద్రబాబు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 10, 2021, 06:56 PM ISTUpdated : Apr 10, 2021, 06:57 PM IST
వైసీపీ గుండెల్లో రైళ్లు.. దొంగ ఓట్లను అడ్డుకోండి: తిరుపతిలో గెలుపు మనదే, చంద్రబాబు వ్యాఖ్యలు

సారాంశం

తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు . 5 లక్షల మెజార్టీతో గెలుపొందుతామని ప్రకటించిన వైసీపీకి ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన చురకలు వేశారు

తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు . 5 లక్షల మెజార్టీతో గెలుపొందుతామని ప్రకటించిన వైసీపీకి ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన చురకలు వేశారు.

నెల్లూరు అనిల్‌ గార్డెన్స్‌లో శనివారం స్థానిక కార్యకర్తలతో నిర్వహించిన తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.

Also Read:Editor Speaks: ఏపీలో చంద్రబాబు బ్లండర్ ఇదీ...

ప్రజలకు అన్నీ చేస్తున్నట్టు సీఎం జగన్‌ లేఖ రాయడం హాస్యాస్పదమని బాబు ఎద్దేవా చేశారు. తాము కరపత్రాలు పంపిణీ చేస్తుంటే ఫిర్యాదు చేస్తున్నారని, ఎన్నికేసులు పెట్టినా భయపడబోమని స్పష్టం చేశారు.

పరిషత్‌ ఎన్నికలు బహిష్కరించడం బాధాకరమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన కార్యకర్తలకు వివరించారు. తిరుపతి ఉప ఎన్నిక టీడీపీ కార్యకర్తలకు ఒక ఆయుధమని.. కార్యకర్తలు భయపడవద్దని చంద్రబాబు సూచించారు. దొంగ ఓట్లను అడ్డుకోవాలని టీడీపీకి  కార్యకర్తలే సైన్యమని విజయం మీ వల్లే సాధ్యమంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hero Ghattamaneni Jayakrishna Speech: జై బాబు.. బాబాయ్ కి నేను పెద్ద ఫ్యాన్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం | Asianet Telugu