పేదల పొట్ట కొట్టి....: వైఎస్ జగన్ కు పర్చూరు ఎమ్మెల్యే బహిరంగ లేఖ

By telugu teamFirst Published Feb 15, 2020, 10:35 AM IST
Highlights

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు బహిరంగ లేఖ రాశారు. జగన్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, పలు ప్రశ్నలు సంధిస్తూ ఆయన జగన్ కు ఆ లేఖ రాశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివ రావు బహిరంగ లేఖ రాశారు. జగన్ నిర్ణయాలను తప్పు పడుతూ ఆయన ఈ బహిరంగ లేఖ రాశారు. ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం కింద ఇస్తున్నాం.

పది మంది పేదల పొట్టకొట్టి.. మీ పార్టీకి చెందిన ధనవంతుల జేబులు నింపాలి అనే మీ దుర్మార్గపు ఆలోచనలు ప్రజాస్వామ్య స్పూర్తికి అంత్యంత ప్రమాదకరం. ఇళ్ల ప్టాల పేరుతో నిరుపేదల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దశాబ్దాలుగా దళితులు, బలహీనవర్గాకు చెందిన సన్నకారు రైతులు, రైతు కూలీలు సాగు చేసుకుంటున్న భూములకు సరైన పత్రాలు లేవంటూ అధికారులు వారి నుంచి భూములు లాక్కోవడం సిగ్గుచేటు. 

ఆ భూముల్ని సాగు చేసుకుంటూ, వాిపైనే ఆధారపడి బతుకుతున్న వారిని రోడ్డు పాలు చేసేలా వ్యవహరించడం దుర్మార్గం. ఇళ్ల ప్టాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును, అధికారుల వ్యవహార శైలిని ప్రశ్నించిన పేదలపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం. ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల ప్టాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బోగస్‌ ప్రచారం చేసుకుంటూ పేదలను మోసం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రభుత్వాలు  సుమారు 20 లక్షలకు పైబడి స్థలాలు మంజూరు చేశాయి. వాటన్నింనీ అడ్డగోలుగా రద్దు చేసి పేదలకు ఇళ్ల ప్టా ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడం పేదలను వంచించడం కాదా? 

గత ప్రభుత్వ హయాంలో పేదలకు కేయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి కొత్తవి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో పేదల కోసం నిర్మించిన 9 లక్షల గృహ నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేశారు. స్థలాలు, ఇళ్ల కేటాయింపులు కూడా జరిగిపోయిన వారిని కూడా అనర్హులుగా గుర్తించి.. మళ్లీ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడం దుర్మార్గం కాదా.?  నెత్తిన తాటాకు పెట్టి.. చేతిలో ఉన్న గొడుగు లాక్కోవడం మీ ఫ్యాక్షన్‌ మనస్తత్వానికి నిదర్శనం కాదా.? 

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు అర్ధాంతరంగా నిలిపివేశారో ప్రజలకు చెప్పగలరా.? వాటిని ఎందుకు పేదలకు అందించలేదో కూడా చెప్పే ధైర్యం చేయగలరా.? ఇవన్నీ మాని కల్లబొల్లి మాటలతో కాలం నెట్టుకురావడం దుర్మార్గం కాదా..? 25 లక్షల మందికి ఇళ్ల ప్టాలు ఇవ్వాంటే సుమారు 10 వేల ఎకరాల భూములను కొనుగోలు చేయాలి. కానీ ఈ 8 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 100 ఎకరాల చొప్పున కూడా కొనుగోలు చేయలేదు. 

గ్రామాలకు, నివాస ప్రాంతాలకు దూరంగా ముంపు భూములు, వాగులు, డొంకలు, కొండల్లో ప్లాట్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? అలా ఇచ్చి ఏదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడం వంచన కాదా.? చెరువు, వాగు, స్మశానం కోసం వదిలిన భూములు, పోరంబోకు, పాఠశాలల గ్రౌండ్స్‌, సామాజిక అవసరాల కోసం ఉపయోగించే భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇళ్ల ప్టాల పేరుతో వైకాపా కార్యకర్తకు దారాదత్తం చేయడం క్షమించరాని నేరం. 

గత ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన అర్హుల జాబితాను పక్కనపెట్టి వైకాపా నాయకులు సిఫార్సు చేసిన వారినే అర్హులుగా ఎంపిక చేయడం మీ రాజకీయ దురుద్దేశాన్ని బయటపెడుతోంది. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతాం. ప్రజల ముందు దోషిగా నిలబెడతాం. వారే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు.                
- ఏలూరి సాంబశివరావు                                      
పర్చూరు శాసనసభ్యులు

click me!