సచివాలయం కోసం పంచాయతీ కార్యాలయం కూల్చివేత, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Nov 22, 2020, 6:05 PM IST
Highlights

కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని తోలుకోడు గ్రామంలో పంచాయతీ కార్యాలయం కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 

కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని తోలుకోడు గ్రామంలో పంచాయతీ కార్యాలయం కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

ఎటువంటి లోపం లేకుండానే గ్రామ సచివాలయ నిర్మాణం కోసం పటిష్టంగా ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని కూల్చివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శిధిలావస్థలో ఉన్న సొసైటీ భవనాన్ని వదిలేసి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కూల్చడం రాజకీయ కక్షే అని టీడీపీ నాయకులు అంటున్నారు.

గ్రామ వైసీపీ నాయకులు కాంట్రాక్టర్ల తో కుమ్మక్కై వారికి లబ్ది చేకూర్చడం కోసం ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధకి పాటు పడాల్సిన నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడి ఏం సాధిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు‌.

పంచాయతీ కార్యాలయం కూల్చివేతపై విచారణ జరిపి భాద్యులైన అధికారులు,నాయకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో కూల్చివేసిన పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులు టీడీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

click me!