త్వరలో జనసేనలోకి: పవన్‌కళ్యాణ్‌తో పంచకర్ల రమేష్ భేటీ

By narsimha lode  |  First Published Jul 16, 2023, 12:12 PM IST

మాజీ ఎమ్మెల్యే  పంచకర్ల రమేష్  ఇవాళ  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో  సమావేశమయ్యారు.


విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో  మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు  ఆదివారంనాడు  మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు.  మూడు రోజుల క్రితం వైఎస్ఆర్‌సీపీకి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  వచ్చే ఎన్నికల్లో  జనసేన నుండి పంచకర్ల రమేష్ బాబు  పోటీ చేయనున్నారు.  పెందుర్తి అసెంబ్లీ  స్థానం నుండి పోటీ చేసేందుకు పంచకర్ల రమేష్ బాబు  రంగం సిద్దం  చేసుకుంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2009 అసెంబ్లీ ఎన్నికల్లో పంచకర్ల రమేష్ బాబు  పీఆర్‌పీ అభ్యర్థిగా  యలమంచిలి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి  విజయం సాధించారు.ఆ తర్వాత  పరిణామాలతో  పీఆర్‌పీ  కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. దీంతో  పంచకర్ల రమేష్ బాబు  కాంగ్రెస్ పార్టీలో చేరారు.2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు  గంటా శ్రీనివాసరావుతో కలిసి టీడీపీలో  చేరారు  పంచకర్ల రమేష్ బాబు. రమేష్ బాబు  టీడీపీ అభ్యర్థిగా యలమంచిలి నుండి పోటీ చేసి విజయం సాధించారు.  2019 ఎన్నికల్లో  పంచకర్ల రమేష్ బాబు టీడీపీ అభ్యర్థిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కొద్ది కాలానికే  పంచకర్ల రమేష్ బాబు  టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 

Latest Videos

undefined

also read:వైసీపీకి భారీ షాక్.. విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి పంచకర్ల రాజీనామా..

వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం కూడ ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది.  జిల్లా అధ్యక్ష పదవిని కూడ  ఆయనకు అప్పగించింది. అయితే  పంచకర్ల రమేష్ బాబు  మూడు రోజుల క్రితం  వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడ ఆయన రాజీనామా చేశారు.  పార్టీలో  తనకు  స్వేచ్ఛ లేదని  రమేష్ బాబు ఆరోపించారు.

వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం కూడ ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది.  జిల్లా అధ్యక్ష పదవిని కూడ  ఆయనకు అప్పగించింది. అయితే  పంచకర్ల రమేష్ బాబు  మూడు రోజుల క్రితం  వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడ ఆయన రాజీనామా చేశారు.  పంచకర్ల రమేష్ బాబు ఆరోపణలను  వైఎస్ఆర్‌సీపీ  కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఖండించారు.  గత కొంత కాలంగా  పంచకర్ల రమేష్ బాబు  జనసేనలో చేరాలని  నిర్ణయం తీసుకున్నారని ఈ క్రమంలోనే  ఆయన  వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


 


 


 


 

click me!