’హైదరాబాద్ తెలంగాణాలో ఉంటేనేం, ఆంధ్రకు నాయుడున్నాడుగా’

Published : Nov 08, 2016, 10:17 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
’హైదరాబాద్ తెలంగాణాలో ఉంటేనేం, ఆంధ్రకు నాయుడున్నాడుగా’

సారాంశం

హైదరాబాద్ తెలంగాణలో ఉంటే, ఆంధ్రకి నాయుడున్నాడుగా... ఆంధ్ర సిఎంకి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి ప్రశంస.

"ఆంధ్రప్రదేశ్ ఒంటరి కాదు, అండదండగా వుంటాం, అన్ని విధాలుగా సాయం అందిస్తాం.విభజన తర్వాత  తెలంగాణాకు హైదరాబాద్ మిగిలితే,  ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు మిగిలారుగా," అని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పణగారియా అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఎకనమిక్ జోన్ ఏర్పాటు గురించి  ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడితో చర్చించారు.

 

విభజన దరిమిలా ఏపీకి జరిగిన నష్టాలు, ఇబ్బందుల గురించి కూడా పణగారియా బృందానికి వివరించి ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని    ముఖ్యమంత్రి కోరినపుడు ఆయన ఇలా వ్యాఖానించారని తెలిసింది. రాష్ట్రాభివృద్ధికి  శ్రమిస్తున్న చాలా గొప్పగా శ్రమిస్తున్నారంటూ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.

 

మలేసియా తదితర దేశాలలో ఈ తరహా జోన్ల వల్ల అభివృద్ధి జరిగింది, ఉద్యోగాల కల్పన జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

 

ఏపీలో వీసీఐసీ, బెంగళూరు-చెన్నయ్ క్యారిడార్ వుంది., సుదీర్ఘ కోస్తా తీరం వుంది. దొనకొండ, ఓర్వకల్, హిందూపురం కూడా ఇందులోకి వస్తాయి. విశాఖ, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి-ఏర్పేడు నాలుగు నోడ్లు, మరోపక్క ఓర్వకల్లు, హిందూపురం, కృష్ణపట్నం నోడ్లు రానున్నాయి.ఏపీకి డెడికేటెడ్ ఫ్రయిట్ క్యారిడార్ వుంది, రోడ్డు రవాణా వ్యవస్థ వుంది.

 

. ఏపీ ఎడ్యుకేషన్ స్టేట్‌గా, నాలేడ్జ్ హబ్‌గా రూపుదాల్చబోతోంది, ఇవన్నీ నీతిఆయోగ్ బృందానికి వివరించామని  ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖ, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి-ఏర్పేడు నాలుగు నోడ్లు, మరోపక్క ఓర్వకల్లు, హిందూపురం, కృష్ణపట్నం నోడ్లు రానున్నాయి. మలేసియా, ఈఏయు, ఫిలిప్సీన్స్, సింగపూర్ తదితర దేశాలలో కోస్టల్ ఎకనామిక్, ఎంప్లాయిమెంట్ జోన్స్ వల్ల ఆ దేశాలు ఎంతోె అభివృద్ధి జరిగిందని చెబుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి జోన్ ఏర్పాటు కావాలని నాయుడు చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?