పాముల పుష్ప శ్రీవాణి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh KarampooriFirst Published Mar 27, 2024, 9:05 AM IST
Highlights

Pamula Pushpa Sreevani Biography: భర్త ప్రోత్సాహంతో ఉపాధ్యాయ వృత్తిని వీడి రాజకీయలోకి వచ్చారు. తొలి ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో గెలుపొంది ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రతిపక్షలో ఉన్న పనితీరుతో స్వపక్ష, ప్రతిపక్ష ద్రుష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి రావడంతో ఉప ముఖ్యమంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఆమెనే వైసీపీ నాయకురాలు, ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. 

Pamula Pushpa Sreevani Biography: భర్త ప్రోత్సాహంతో ఉపాధ్యాయ వృత్తిని వీడి రాజకీయలోకి వచ్చారు. తొలి ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో గెలుపొంది ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రతిపక్షలో ఉన్న పనితీరుతో స్వపక్ష, ప్రతిపక్ష ద్రుష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి రావడంతో ఉప ముఖ్యమంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఆమెనే వైసీపీ నాయకురాలు, ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. 

బాల్యం, విద్యాభ్యాసం

పాముల పుష్ప శ్రీవాణి..  1986 జూన్ 22న పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జన్మించారు. చిన్నప్పుడు నుండి ఆమె చదువులో చురుకుగా ఉండేవారు. ఆమె విద్యాభ్యాసం చాలా సింపుల్ గా సాగిపోయింది. ఆమె ప్రాథమిక విద్య తన సొంత గ్రామంలో, ఆ తర్వాత పదవ తరగతి వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నారు.  ఇంటర్, డిగ్రీ  జంగారెడ్డిగూడెంలో చదువుకున్నారు. ఆ తరువాత విశాఖలో బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉండటంతో పుష్ప శ్రీవాణి బీఈడీ పూర్తి చేసిన వెంటనే ఉపాధ్యాయురాలుగా పనిచేయడం ప్రారంభించారు. ఆ సమయంలో వందలాది మంది పిల్లలకు చదువు చెబుతూ వారి అభ్యున్నతి కోసం ప్రోత్సహించేది.  
 
రాజకీయ జీవితం 

ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు విద్యాబుద్దులు చెబుతూ సంతృప్తిగా ఉద్యోగ జీవితాన్ని గడుపుతోన్న వేళ తన భర్త ప్రోత్సాహంతో ఉపాధ్యాయ వృత్తిని వీడి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఉండే తన భర్తతో ఆమె రాజకీయాల గురించి ఆలోచిస్తూ.. తన ఆలోచనలను చెబుతూ ఉండేది. తొలుత  2014 శాసనసభ ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేసి 19,083 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.  మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఆ స్థాయి మెజారిటీ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇలా ఆమె రాజకీయ ప్రయాణం సూపర్ మెజారిటీతో ప్రారంభం అవడంతో మళ్ళీ వెనతిరిగి చూసుకోవలసిన రాలేదు. 

మొదటిసారి ఎమ్మెల్యే అయినా పుష్పశ్రీవాణి తన నియోజకవర్గ ప్రజల వద్ద మంచి మార్కులు తెచ్చుకుంది. ప్రతిపక్షంలో ఉన్న కూడా తనకు సాధ్యమైనంత అభివృద్ధి చేసింది. దాంతో ఆమెను మళ్ళి 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి నరసింహ తట్రాజ్ పై ఏకంగా 26వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే సమయంలో వైసీపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడంతో సీఎం అయినా జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో పుష్పశ్రీవాణికి ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా చోటు కల్పించారు.

తన నియోజకవర్గం అభివృద్ధిని, తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అభివృద్ధిని రెండు కళ్ళుగా పుష్పశ్రీవాణి ముందుకు సాగుతున్నారు.  ఆమె తన పనితీరు విషయంలో టాప్ లో ఉంటారన్నడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె తీరు జోరు చూస్తుంటే..  2024 ఎన్నికల్లోనూ  మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి  కురుపాం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 
 

click me!