నేను ఎమ్మెల్యేనండీ.. నన్నే పట్టించుకోరా: డీఐజీపై పామర్రు ఎమ్మెల్యే ఫైర్

Siva Kodati |  
Published : Feb 13, 2021, 02:17 PM IST
నేను ఎమ్మెల్యేనండీ.. నన్నే పట్టించుకోరా: డీఐజీపై పామర్రు ఎమ్మెల్యే ఫైర్

సారాంశం

కృష్ణా జిల్లా పామర్రులో వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్, డీఐజీ మోహనరావుల మధ్య వివాదం నెలకొంది. పోలింగ్ సందర్భంగా ఏజెంట్‌పై దాడి జరిగిందంటూ డీఐజీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు ఎమ్మెల్యే అనిల్

కృష్ణా జిల్లా పామర్రులో వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్, డీఐజీ మోహనరావుల మధ్య వివాదం నెలకొంది. పోలింగ్ సందర్భంగా ఏజెంట్‌పై దాడి జరిగిందంటూ డీఐజీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు ఎమ్మెల్యే అనిల్.

అయితే డీఐజీ తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయారంటూ నిరసనకు దిగారు అనిల్ కుమార్. డీఐజీ తిరిగొస్తుండగా.. ఆయన వాహనాన్ని అడ్డగించి నిలదీశారు. ఫిర్యాదు చేయడానికి వస్తే నిర్లక్ష్యంగా వెళ్లిపోతారా అంటూ ప్రశ్నించారు.

అయితే ఎమ్మెల్యేను గుర్తుపట్టలేదని అంటున్నారు డీఐజీ. దీనిపై స్పీకర్‌ను ఫిర్యాదు చేస్తానంటు న్నారు అనిల్. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఒక ప్రజా ప్రతినిధిని అలాంటిది తనను పక్కకు వెళ్లాలని అన్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు పడుతున్న ఇబ్బందులపై ఫిర్యాదు చేద్దామని వెళ్లానన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు