P Gannavaram assembly elections result 2024: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గం పి. గన్నవరం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే 2024 ఎన్నికల్లోనూ వైసిపి, టిడిపిల మధ్య పోరు హోరాహోరీ సాగింది. దీంతో పి. గన్నవరంలో ఎలక్షన్ రిజల్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
P Gannavaram assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాత గన్నవరం ఒకటి. ఈ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా ఎస్సీ ఓట్లు వుంటాయి. దీంతో బలమైన దళిత నేతలను ఈ నియోజకవర్గ బరిలో నిలిపాయి వైసిపి, టిడిపి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విప్పరి వేణుగోపాల్, కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ (జనసేన) పోటీ చేశారు. వీరి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది.
పి. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
undefined
1. పి. గన్నవరం
2. అంబాజీపేట
3. అయినమిల్లి
4. మామిడికుదురు ( కొన్ని గ్రామాలు)
పి. గన్నవరం అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 1,95,237
పురుషులు - 96,683
మహిళలు - 98,643
పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు మరోసారి పి.గన్నవరంలో పోటీచేసే అవకాశం వైసిపి ఇవ్వలేదు. అతడి స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ ను వైసిపి అభ్యర్థిగా ప్రకటించారు.
టిడిపి అభ్యర్థి :
పి. గన్నవరం బరిలో మహాసేన రాజేష్ ను బరిలో దించాలని భావించినా చివరి క్షణంలో కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ (జనసేన) ను పోరులో దింపింది కూటమి.
పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,56,212 (82 శాతం)
వైసిపి - కొండేటి చిట్టిబాబు - 67,373 (43 శాతం) - 22,207 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి -నేలపూడి స్టాలిన్ బాబు - 45,166 (28 శాతం) - ఓటమి
పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,42,815 (78 శాతం)
టిడిపి - పులపర్తి నారాయణ మూర్తి - 4,967 (52 శాతం) - 13,505 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - కొండేటి చిట్టిబాబు - 61,462 (43 శాతం) - ఓటమి