అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Published : Jun 04, 2024, 06:50 AM ISTUpdated : Jun 06, 2024, 07:11 PM IST
అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

సారాంశం

Anakapalle assembly elections result 2024: ఉత్తరాంధ్రలో అధికార వైసిపి, ప్రతిపక్ష కూటమికి మధ్య ఆసక్తికర పోరుసాగుతున్న నియోజకవర్గం అనకాపల్లి. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ కొనసాగుతున్నారు. 

Anakapalle assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు ఓ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరి సీట్ల సర్దుబాటు కూడా పూర్తయ్యింది. ఇందులో భాగంగా అనకాపల్లి సీటు జనసేన పార్టీకి దక్కింది... దీంతో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బరిలోకి దిగారు. 

ఇక అనకాపల్లి నియోజకవర్గంలో టిడిపి పార్టీ బలంగా వుంది. ఆ పార్టీ ఆవిర్బావం (1983) నుండి 2004 వరకు ఇక్కడ టిడిపిదే విజయం. మొదటిసారి రాజా కన్నబాబు టిడిపి తరపున పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత దాడి వీరభద్రరావు (1985,1989, 1994, 1999) వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. చివరిసారిగా  2014 లో పీలా గోవింద సత్యనారాయణ టిడిపి నుండి పోటచేసి గెలిచారు. 2019 లో వైఎస్ జగన్, వైసిపి హవా వీయడంతో గుడివాడ అమర్నాథ్ గెలిచారు. 

ఇదిలావుంటే ప్రస్తుత జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ 2004లో ఇదే అమలాపురం నుండి కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలిచారు. అలాగే  2009 లో గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీచేసి గెలిచారు.  

అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని  మండలాలు :

1. అనకాపల్లి 
2.  కాసింకోట

అనకాపల్లి అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,05,573   
పురుషులు -    1,00,717
మహిళలు ‌-    1,04,839

అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

అనకాపల్లి సీటు విషయంలో అధికార వైసిపి సంచలన నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రమే కాదు మంత్రిగా కొనసాగుతున్న గుడివాడ అమర్నాథ్ ను పక్కనబెట్టి మలసాల భరత్ కుమార్ కు అనకాపల్లి టికెట్ ఇచ్చారు. అమర్నాథ్ ను మరో నియోజకవర్గానికి షిప్ట్ చేసారు. 

 జనసేన అభ్యర్థి : 

ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ అనకాపల్లిలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా బలంగానే వున్నా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది. 

అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ మలసాల భరత్ కుమార్ పై జనసేన చెందిన కొణతాల రామకృష్ణ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కొణతాల రామకృష్ణ    115,126 ఓట్లు పొందగా..  మలసాల భరత్ కుమార్ 49,362 ఓట్లు సాధించారు.

అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,1,59,378 (78 శాతం)

వైసిపి - గుడివాడ అమర్నాథ్ - 73,207 ఓట్లు (45 శాతం) - 8,169 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - పీలా గోవింద సత్యనారాయణ - 65,038 ఓట్లు (40 శాతం) - ఓటమి
 
జనసేన పార్టీ ‌- పరుచూరి భాస్కరరావు - 12,988 (7 శాతం)

అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,49,837 ఓట్లు (78 శాతం)

టిడిపి - పీలా గోవింద సత్యనారాయణ - 79,911 (53 శాతం) - 22,341 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - కొణతాల రఘునాథ్ - 57,570 (38 శాతం) - ఓటమి

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు