షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు.. పెట్టుబడులపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం : సజ్జల రామకృష్ణారెడ్డి

Published : Dec 16, 2022, 02:20 AM IST
షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు.. పెట్టుబడులపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం : సజ్జల రామకృష్ణారెడ్డి

సారాంశం

Amaravati: పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిబంధనలు పాటిస్తున్నదని  ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత టీడీపీ హయాంలో పేరుకుపోయిన బకాయిలను జగన్ ప్రభుత్వం తీరుస్తోందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 

Govt Advisor (Public Affairs) Sajjala Ramakrishna Reddy: ముందస్తు ఎన్నికల అవకాశమే లేదనీ, షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిబంధనలు పాటిస్తున్నదని తెలిపారు. గత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) హయాంలో పేరుకుపోయిన బకాయిలను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం తీరుస్తోందని ఆయ‌న  చెప్పారు.

ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునివ్వరని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2024లో షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసి, తన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తారనీ, ఆ తర్వాత తన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఆధారంగా కొత్త ఆదేశాన్ని కోరుతూ ఎన్నికలకు వెళ్తారని ఆయన అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష తెలుగుదేశం తన నాయకులను, కార్యకర్తలను కోల్పోతుందని అన్నారు. మిగిలిన కార్యకర్తలను టీడీపీలో ఉంచాలనే ఆశతో చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనతో పాటు ఇతర టీడీపీ నేతలు, దాని అనుకూల మీడియా కూడా ఇదే పాట పాడుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిందనీ, హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేసిందన్నారు. మూఢనమ్మకాలను, గ్రహ ప్రభావాలను వైసీపీ నమ్మదని అన్నారు.

కౌలు రైతులకు సంబంధించిన నిబంధనలను ముఖ్యమంత్రి సరళీకృతం చేశారని తెలిపారు. కౌలు రైతులకు ఇంతకంటే మెరుగైన విధానం ఏదైనా ఉందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి రైతులకు ఏదో చేస్తున్నానని చెప్పి, ఫోటోలకు పోజులిచ్చి మాయమవుతారని విమర్శించారు. తెలంగాణ, ఏపీల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందనీ, ఈ విషయంలో ఏపీ సుప్రీంకోర్టు తలుపు తట్టిందని ఆయన అన్నారు. నిజమైన రైతులు అమరావతిలో భూములు అమ్ముకున్నారనీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి ఉద్యమంలో భాగమయ్యారని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల దృష్ట్యా వారు న్యూఢిల్లీలో పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

అంతకుముందు, పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిబంధనలు పాటిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బంధువులు, మిత్రులు అనుమతులు ఇస్తున్నారని కొందరు నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమోషన్లపై చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. టీడీపీ హయాంలో పేరుకుపోయిన బకాయిలను సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం తీరుస్తోందన్నారు. 

పంప్ స్టోరేజీ జలవిద్యుత్ ప్రాజెక్టుల టెండర్లను పారదర్శకంగా ఖరారు చేసినట్లు సజ్జల తెలిపారు. పారిశ్రామిక ప్రోత్సాహంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ విధానాన్ని అనుసరిస్తోందనీ, బహిరంగ వేలం ద్వారా లైసెన్సులు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహానికి కట్టుబడి ఉందనీ, పంప్‌డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టులను కూడా పారదర్శకంగా మంజూరు చేశామన్నారు. ఏపీకి పెట్టుబడులపై వస్తున్న స్పందనను టీడీపీ నేతలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని సజ్జల రామ‌కృష్ణ రెడ్డి ఆరోపించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్