సాయం చేసే గుణమే ఆయుధం: పోలీసులనే దోచేసిన సైబర్ కేటుగాళ్లు

By Siva KodatiFirst Published Aug 28, 2020, 2:31 PM IST
Highlights

ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. వీరి బాధితుల్లో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పోలీస్ శాఖను కూడా వీరు టార్గెట్ చేశారు. 

ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. వీరి బాధితుల్లో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పోలీస్ శాఖను కూడా వీరు టార్గెట్ చేశారు.

కష్టంలో ఆదుకునే మంచి మనుషులను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు పోలీసులను దోచేశారు. ఫేస్‌బుక్‌లో పోలీసులు, లాయర్లు, వైద్యుల పేరుతో పేజీలు సృష్టించిన సైబర్ నేరగాళ్లు.. ప్లాన్‌లో భాగంగా వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టారు.

వీరి ప్రతిపాదనకు అంగీకరం లభించిన తర్వాత మెసెంజర్ ద్వారా అత్యవసరమంటూ రెండు, మూడు వేల రూపాయల సాయం చేయనమడం జరుగుతోంది. దీంతో చాలా మంది ఏదో అవసరం వుంటుందులే అనుకున్న కొందరు పేటీఎం, ఫోన్ పే ద్వారా పంపించేస్తున్నారు.

ఈ కోవలోనే చాలా మంది పోలీస్ అధికారులు కూడా బలయ్యారు. రూ.లక్షల్లో సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. తాజాగా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై హరి పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా ప్రారంభించాడు.

అతని మిత్రులందరినీ నకిలీ ఖాతాలో యాడ్ చేసుకుని వారితో చాట్ చేశారు. అత్యవసరం వుందని.. గంటలో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ స్నేహితులకు మెసేజ్‌లు పంపించడంతో చాలా మంది ఫోన్ పే, పేటీఎంల ద్వారా పంపించారు.

అయితే ఫోన్ పేలో పేరు సరిగా లేకపోవడంతో ఒకరికి అనుమానం వచ్చి ఎస్సై హరికే నేరుగా ఫోన్ చేయడంతో ఆయన అవాక్కయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి, ఆ ఖాతాను బ్లాక్ చేయించారు. ఎవ్వరూ డబ్బులు వేయవద్దని వాట్సాప్ ద్వారా మిత్రులందరికీ మెసేజ్‌లు పెట్టారు. 

click me!