బెజవాడలో చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు.. బాలుడు మృతి

Siva Kodati |  
Published : Aug 06, 2022, 09:10 PM IST
బెజవాడలో చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు.. బాలుడు మృతి

సారాంశం

విజయవాడ కంసాలిపేటలో కారు బీభత్సం సృష్టించింది. ఏపీ07డీజే 3415 కారు పిల్లలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా.. ఇద్దరి పరిస్ధితి విషమంగా వుంది. మృతి చెందిన చిన్నారి పేరు షకీల్‌గా తెలుస్తోంది. అజీమ్, కిశోర్ తీవ్రంగా గాయపడ్డారు.   

స్థానికుల కథనం ప్రకారం.. పార్కింగ్ చేసి ఉన్న కారు తోలేందుకు ఓ మైనర్ ప్రయత్నించాడు. దీంతో కారు వేగంగా ముందుకు దూసుకొచ్చి రోడ్డు ఫై ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి , మరో ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడి తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో వాళ్ల కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం రోడ్ల పై జనాలు ఉండే ప్రాంతం కావడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. 
 
PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!