ఏపీలో దుర్ఘటన.. ఏనుగుల దాడిలో.. ఫారెస్ట్ అధికారి మృతి

By Mahesh KFirst Published Jan 13, 2022, 5:04 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల సంచారం కలకలం రేపుతున్నది. చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నది. దాన్ని తమిళనాడులోకి మళ్లించాలని  అటవీ శాఖ అధికారి చిన్నబ్బ ప్రయత్నించాడు. కానీ, ఆ ఏనుగులు ఒక్క ఉదుటన ఆయనపై దాడికి దిగాయి. ఏనుగులు దాడిలో చిన్నబ్బ తీవ్రంగా గాయపడ్డడు. మరణించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) జిల్లా చిత్తూురు(Chittoor)లో దారుణం జరిగింది. ఏనుగులు(Elephants) ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చాయి. దీంతో వాటిని తరమడానికి వచ్చిన వ్యక్తిపై దాడి(Attack) చేశాయి. చిత్తూరు జిల్లాలో 14 ఏనుగులు గుంపుగా సంచరిస్తున్నాయి. వాటిని తమిళనాడులోకి తరమడానికి అ అధికారి ప్రయత్నించాయి. కానీ, ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి ఏనులు ఆగ్రహించాయి. వాటిని తరముతుున్న వ్యక్తిపై దాడి చేశాయి. ఇందులో ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏనుగుల సంచారమే స్థానికంగా ఆందోళనలు రేకెత్తించాయి. తాజా ఘటనతో మరిన్ని భయాందోళనలు నెలకొంటున్నాయి.

చిన్నబ్బ అటవీ శాకలో ట్రాకర్ సహాయకుడిగా పని చేసేవాడు. చిత్తూరులో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తమిళనాడుకు తరలించడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ, ఒక్క నిమిషంలో ఏనుగులు ఎందుకు ఉగ్రరూపం దాల్చాయో తెలియదు. ఒక్కసారిగా ఆ ఏనుగులు  చిన్నబ్బపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నబ్బ మరణించాడు. మరణించిన చిన్నబ్బ వివరాలను పోలీసులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బలిజపల్లె గ్రామానికి చెందినవాడిగతా చిన్నబ్బను గుర్తించారు.

herd of elephantsను తరిమేందుకు అటవీ సిబ్బంది జరిపిన Firingకు .. అమ్మ ఒడిలో సేదతీరుతున్న రెండేళ్ల చిన్నారి శాశ్వతంగా ఒరిగిపోయింది. Assamలోని కామరూప్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోకోలోని బోండపారా ప్రాంతానికి ఇటీవల ఏనుగులు గుంపుగా వచ్చాయి. వాటిని తరిమేందుకు Forest staff కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. 

ఏనుగులను బెదిరించేందుకని గురువారం రాత్రి వారు తుపాకులతో కాల్పులు జరిపారు. అయితే, ఓ  తూటా ప్రమాదవశాత్తూ.. అక్కడికి సమీపంలోని ఓ ఇంటి ముందు అమ్మ ఒడిలో కూర్చున్న బిడ్డ శరీరంలోకి బలంగా దూసుకెళ్లింది. ఆమె తల్లిని కూడా ఆ తూటా గాయపరిచింది.

గార్డులు వెంటనే వారిద్దరినీ బోకోలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ, అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన తల్లిని గువాహటి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

ఇదిలా ఉండగా, గత మేలో అసోంలోని అటవీ ప్రాంతంలో ఘోరం జరిగిపోయింది. అడవిలో ఉన్న 18 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. ఈ ఘటనమీద chief minister తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేయాలని అటవీ శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. 

కొండమీద, కొండ దిగువన గజరాజుల dead bodyలు పడి ఉన్నాయి. ఈ ఘటన మీద సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణకు ఆదేశించారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అడవిలో పర్యటిస్తున్నారు. అసోం నాగావ్ జిల్లాలోని బాముని హిల్స్ వద్ద కాతియోటోలి పరిధిలోని కండోలి ప్రతిపాదిత రిజర్వ్డ్ ఫారెస్ట్ (పీఆర్ఎఫ్) లో గురువారం 18 అడవి ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఒక ప్రమాదంలో గజరాజులు మృతి చెంది ఉంటాయని అటవీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏనుగుల మృతి వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్పందించిన పోలీసులు వెతికే పనిలో పడ్డారు. ఏనుగులు మరణించడానికి కారణమేంటి? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. 

click me!