Omicron Cases in AP: మహమ్మారి బారిన మరో ఇద్దరు...ఏపీలో ఆరుకు చేరిన ఒమిక్రాన్ కేసులు

By Arun Kumar PFirst Published Dec 26, 2021, 8:57 AM IST
Highlights

గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తాజాగా ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విరుచుకుపడుతోంది. తాజాగా ఏపీలో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. 

అమరావతి: యావత్ ప్రంపంచాన్ని మరోసారి కరోనా (corona cases) మహమ్మారి భయపెడుతోంది. న్యూ వేరియంట్ ఒమిక్రాన్ (omicron) దక్షిణాఫ్రికాలో ప్రారంభమై ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. ఇలా భారతదేశాన్ని కూడా వదిలిపెట్టని ఈ మహమ్మారి మెల్లిగా రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది. తెలుగురాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఇప్పటికే తెలంగాణ (telangana)లో అధికంగా ఒమిక్రాన్ కేసులు భయపటపడుతుండగా ఏపీ (andhra pradesh)లోనూ విజృంభణ మొదలయ్యింది. తాజాగా విదేశాల నుండి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. 

ఎట్ రిస్క్ దేశాల నుండి వచ్చిన ఇద్దరికి విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహించారు. ఒకరు దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాదు మీదుగా ప్రకాశం జిల్లా ఒంగోలు కు రాగా మరొకరు యుకె నుంచి బెంగళూరు మీదుగా అనంతపురం జిల్లాకు వచ్చాడు. అయితే కరోనా పరీక్షలో వీరికి పాజిటివ్ రావడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెలింగ్ కు పంపించారు.  సిసీఎంబీలో పరీక్షలు చేయగా ఇద్దరికీ ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. 

read more  ఏపీలో నిలకడగా కరోనా కేసులు.. 24 గంటల్లో 104 మందికి పాజిటివ్, చిత్తూరులో అత్యధికం

వెంటనే ఇరు జిల్లాలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమైన ఒమిక్రాన్ బారినపడ్డ ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు. అలాగే వీరి కుటుంబసభ్యులతో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కు కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ లో ఎవరికీ కరోనా నిర్దారణ కాలేదు. 

ఇక తాజాగా 1290 మంది విదేశాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో జీనోమ్ సీక్వెలింగ్ కోసం సిసిఎంబికి పంపించారు. ఇప్పటికే కొందరి టెస్టుల పరీక్షల ఫలితాలు వెల్లడవగా ఇద్దరికి పాజిటివ్ గా తేలింది.

ఇటీవలే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ నిర్థారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఈ నెల 19న కువైట్ (Kuwait) నుంచి విజయవాడకు చేరుకుంది. విజయవాడ మీదుగా కారులో స్వస్థలం అయినవిల్లికి వెళ్లింది. అయితే ఆమెకు గన్నవరం ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్దారణ కాగా శాంపిల్ ను జీనోమ్ సీక్వెలింగ్ కు పంపితే ఓమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

read more  Omicron విజృంభణ వేళ కలకలం... మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్

అప్రమత్తం అయిన అధికారులు, కుటుంబ సభ్యులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగటివ్ వచ్చిందని, వారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తూర్పు గోదావరి జిల్లా అదనపు డీఎంహెచ్ వో వెల్లడించారు.  

ఇక డిసెంబర్ 22న ఏపీలో  రెండో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కెన్యా (kenya) నుండి తిరుపతికి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ నెల 12న ఆమెకు పరీక్షలు నిర్వహిస్తే  కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆమె శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఈ పరీక్షల్లో ఆ మహిళకు కరోనా ఒమిక్రాన్ సోకిందని తేలింది.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు ఈ నెల 12న నమోదైంది.  ఐర్లాండ్ నుండి ఏపీకి వచ్చిన  34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. Vizianagaram జిల్లాకు వచ్చిన ఆ వ్యక్తికి ఒమిక్రాన్  సోకడంతో ఆయనతో కాంటాక్టులోకి వెళ్లిన ఆయన బంధువులకి కూడా పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తిని కూడా ఐసోలేషన్ కు తరలించారు.

 


 

click me!