సత్తెనపల్లిలో దారుణం : వృద్ధురాలిని బెదిరించి దోపిడి, ఫిట్స్ తో ముళ్ల కంచెలో పడి నరకం...

By AN TeluguFirst Published Nov 26, 2020, 12:57 PM IST
Highlights

పట్టణంలోని  భీమవరం రోడ్డు రైల్వే గేటు వద్ద ఉన్న చర్చ్ వద్దకు వెళ్తున్న వృద్ధురాలిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆపి ఆమె వద్ద ఉన్న నగదును అపహరించారు. భయాందోళనకు గురైన వృద్ధురాలికి ఫిట్స్ రావటంతో పక్కన ఉన్న ముళ్ళకంచెలో పడిపోయింది. రాత్రి సమయం కావటంతో ఎవరూ గుర్తించలేదు. 
 
ఓ పక్క చలి,మరోపక్క వర్షం కాపాడేవారు లేక వణుకుతూ ఆ అభాగ్యురాలు  నరకం అనుభవించింది. ఉదయం గమనించిన స్ధానికులు వావిలాల ప్రజ్వలన సేవా సంస్దకు సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన సేవ సంస్థలు వృద్ధురాలిని అక్కడ నుండి బయటకు తీసి స్ధానిక మెల్లమాంబ వృద్దాశ్రమంలో చేర్పించారు. ఆమెకు కావాల్సిన మందులు,బట్టలు,దుప్పటి, మంచం వంటి వస్తువులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళం విజయ భాస్కర్ రెడ్డి సహకారంతో కల్పించారు.

సహ్రుదయంతో స్పందించి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించిన నిర్వాహకులు ఆరేపల్లె కొండలకు, ఆర్ధిక సాయం అందించిన కళ్ళం విజయ భాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ఆశ్రమంలో చేర్చింపిన కొద్ది సేపటికి తేరుకున్న వృద్ధురాలు తాను సత్తెనపల్లి పట్టణంలోని పార్కు ఏరియా పశు వైద్యశాల ప్రాంతంలో ఉంటానని, తన పేరు షేక్ కరీంబి అని తెలిపింది. పిల్లలు తనను పట్టించుకోకపోవటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా వావిలాల ప్రజ్వలన సేవా సంస్ధ ప్రతినిధి మాట్లాడుతూ... రైల్వే గేటు సమీపంలో కొంతమంది యువత గంజాయి,మద్యం సేవిస్తూ రాత్రి వేళల్లో బీభత్సం సృష్టిస్తున్నారని అలాంటి ప్రదేశాల్లో నిఘా ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

click me!