నివర్ తుఫానుపై వైఎస్ జగన్ సమీక్ష: అధికారులకు ఆదేశాలు

Published : Nov 26, 2020, 12:16 PM IST
నివర్ తుఫానుపై వైఎస్ జగన్ సమీక్ష: అధికారులకు ఆదేశాలు

సారాంశం

నివర్ తుఫాను ప్రబావంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్షించారు. తుఫాను ప్రభావంపై సీఎంవో అధికారులు వైఎస్ జగన్ కు వివరించారు. నష్టం జరగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అమరావతి: నివర్‌ తుపాను ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. తుపాను ప్రభావం, దీనివల్ల కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ఆయనకు వివరాలు అందించారు. తుపాను తీరాన్ని తాకిందని, క్రమంగా బలహీనపడుతోందని వివరించారు. తీవ్రత కూడా తగ్గతోందన్నారు. 

చిత్తూరులోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని, అలాగే కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు ప్రారంభం అయ్యానన్నారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని ముఖ్యమంత్రికి తెలిపారు. పెన్నాలో ప్రవాహం ఉండొచ్చని, సోమశిల ఇప్పటికే నిండినందున వచ్చే ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేస్తామని సీఎంఓ కార్యాలయ అధికారులు సీఎంకు తెలిపారు. 

Also Read: ఏపీలో నివర్‌ తుపాన్‌ బీభత్సం.. భారీ వర్షాలు, నిండుతున్న చెరువులు

అక్కడక్కడా పంటలు నీటమునిగిన ఘటనలు వచ్చాయని, వర్షాలు తగ్గగానే నష్టం మదింపు కార్యక్రమాలు చేపడతామన్నారు. రేణిగుంటలో మల్లెమడుగు రిజర్వాయర్‌ సమీపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 
అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. 

Also Read: అర్థరాత్రి తీరం దాటిన నివర్... ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త: విపత్తుల శాఖ హెచ్చరిక

నెల్లూరు జిల్లాలో కరెంటు షాకుతో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు జారీచేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu