కరోనా నింపిన విషాదం: గుండెపోటుతో భర్త మృతి..జీర్ణించుకోలేక భార్య కూడా

Siva Kodati |  
Published : Sep 22, 2020, 03:15 PM IST
కరోనా నింపిన విషాదం: గుండెపోటుతో భర్త మృతి..జీర్ణించుకోలేక భార్య కూడా

సారాంశం

తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బారినపడిన భార్యాభర్తలు ఆసుపత్రికి వెళుతుండగా గుండెపోటుతో మరణించారు

తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బారినపడిన భార్యాభర్తలు ఆసుపత్రికి వెళుతుండగా గుండెపోటుతో మరణించారు. వివరాల్లోకి వెళితే మదనపల్లికి చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో మంగళవారం వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వచ్చింది.  

ముందుగా భార్య వెళ్లి అంబులెన్స్‌లో కూర్చొంది. అయితే తాను ఆసుపత్రికి వెళ్లేదే లేదని భర్త భీష్మించుకుని కూర్చొన్నాడు. బంధువులు నచ్చజెప్పినప్పటికీ వినకపోవడంతో అతనిని బలవంతంగా అంబులెన్స్‌లో కూర్చొబెట్టే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయాడు. కళ్లెదుటే భర్త చనిపోవడాన్ని చూసిన భార్యకు కూడా గుండెపోటు వచ్చి చనిపోయింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?