ఇది చావు కాదు మిథ్య అనాలట

Published : Dec 17, 2016, 07:23 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఇది చావు కాదు మిథ్య అనాలట

సారాంశం

 వెయ్యి రుపాయలంటే  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి, మాజీ బిజెపి నేత జనార్ధన్ రెడ్డికి ,ప్రధాని మోదీ చెలికాడు, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు గడ్డిపోచ కావచ్చు. ఒక మనిషి ప్రాణం పొగొట్టుకోవలసినంత పెద్ద సంపద కాకపోవచ్చు. అయితే,  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సింగవరపు ఆదినారాయణకు ఆ వెయ్యే జీవితం. అదే కొండంత అస్తి.

 

 వెయ్యి రుపాయలంటే  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి, మాజీ బిజెపి నేత జనార్ధన్ రెడ్డికి ,ప్రధాని మోదీ చెలికాడు, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు గడ్డిపోచ కావచ్చు. ఒక మనిషి ప్రాణం పొగొట్టుకోవలసినంత పెద్ద సంపద కాకపోవచ్చు. అయితే,  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సింగవరపు ఆదినారాయణకు ఆ వెయ్యే జీవితం.  అదే కొండంత అస్తి. ఆ వెయ్యే  అందకపోతే...

 

ఏం జరిగిందో తెలుసా?

 

 ఆయన విలవిల్లాడి ప్రాణాలు విడిచాడు.  తొంబయేళ్ల పల్లెటూరి పేద ముసిలోడికి వేయి రుపాయలంటే మాటలా. వృద్ధాప్య పెన్షన్ కింద ఆయన ప్రతినెల ఒక వెయ్యి అందేవి.  రెన్నెళ్లుగా ఆందటం కష్టంమయింది. పోయిన నెల అతికష్టమ్మీద దొరికాయి. కానీ ఈ నెల కాటేసింది.

 

అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం కు చెందిన ఆదినారాయణ తన పెన్షన్ కోసం కోసం కాళ్లరిగేలా బ్యాంకు చట్టు తిరిగాడు. వేయి దొరక లేదు.  దిక్క లేని అదినారాయణ ఆ వేయ్యితోనే బతకాలి. లేకుంటే బిక్షాటనే. మూడు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. క్యూలో నిలబడి అలసి ఖాయిలా పడ్డాడు.  గురువారం కూడా అలాగే అస్వస్థతతోనే లైన్లో నిలబడ్డాడు. ఇంకా అలసిపోయి ఇంటికి చేరాడు. శుక్రవారం తెల్లవారుజామున 'నా పెన్షన్‌' అంటూ కలవరిస్తూనే ప్రాణాలు విడిచాడు.

 

ఇది మిథ్య అంటున్నాడు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా.

 

గంటల కొద్ది క్యూలైన్లలో నిలుచుకోలేక నీరసించి పోతున్న ముసిలి వాళ్లు అక్కడే కుప్పకూలి రాలిపోతున్నారు. రాష్ట్రంలో శుక్రవారం నాడూ బ్యాంకుల దగ్గిర క్యూలైన్ల లోనే ముగ్గురు ప్రాణాలు వదిలారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామానికి చెందిన బచ్చల లక్ష్మమ్మ (66) క్యూ లైన్‌లోనే కిందపడి చనిపోయింది. ఆమె తనకొచ్చే వృద్ధాప్య పింఛను కోసం వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలోని ఆంధ్రా బ్యాంకు వద్ద క్యూలో నిల్చొని కుప్పకూలిపోయింది. స్థానికులు సపర్యలు చేసినా ఫలితం దక్కలేదు.

 

రేండో విషాదం  కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు దగ్గిర జరిగింది. మల్యాల గ్రామానికి చెందిన సుంకులమ్మ (63) పెన్షన్ కోసం వచ్చి క్యూలోనే సొమ్మసిల్లి  పడిపోయి, ఇంక మళ్లీ కోలుకోలేదు.చనిపోయింది.

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu