కారణమిదీ: ఏపీ హైకోర్టు ముందు వృద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

By narsimha lode  |  First Published Oct 4, 2021, 4:08 PM IST

ఏపీ హైకోర్టు ముందు వృద్ద దంపతులు సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  తమకు న్యాయం చేయాలని ఆ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.  వీరిని దేవేందర్, భానుశ్రీలుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల గ్రామానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు.


అమరావతి: ఏపీ హైకోర్టు  (ap high court)ముందు వృద్ద (old age couple) దంపతులు సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి (suicide attempt)  పాల్పడ్డారు.తమకు న్యాయం చేయాలని  వృద్ద దంపతులు హైకోర్టు ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వృద్ద దంపతులను గుంటూరు జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం దూళిపాళ్లకు చెందిన దేవేందర్(devender), భానుశ్రీ (bhanu sri)దంపతులుగా పోలీసులు గుర్తించారు. ఈ గ్రామంలో బస్ షెల్టర్ నిర్మాణం కోసం స్థానిక నేతలు ఈ దంపతులను సెంట్ భూమి ఇవ్వాలని కోరారు.

Latest Videos

ఈ విషయమై స్థానిక నేతలతో వృద్ద దంపతులకు మధ్య వివాదం చోటు చేసుకొంది.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని వృద్ద దంపతులు హైకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో గుర్తించిన స్థానికులు ఆత్మహత్యాయత్నాఅడ్డుకొన్నారు. వృద్ద దంపతులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.


 

click me!