దారుణం.. కౌన్సెలింగ్ అని స్టేషన్ కు పిలిచి బాలుడిని తీవ్రంగా కొట్టిన ఎస్ఐ..

By Asianet NewsFirst Published Apr 29, 2023, 8:28 AM IST
Highlights

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ తనను చితకబాదాడని ఓ బాలుడు ఆరోపించాడు. పలువురు గొడవ పడుతుంటే తాను ఆపేందుకు వెళ్లానని చెప్పాడు. ఆ గొడవకు, తనకు ఏ సంబంధమూ లేకపోయినా స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టారని తెలిపాడు. 

ఓ బాలుడిని ఎస్ఐ తీవ్రంగా చితకబాదాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో రెండు రోజుల క్రితం జరగ్గా.. ఆలస్యంగా వెలుగు చూసింది. ‘ఈనాడు’ కథనం ప్రకారం.. తాడిపత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓం శాంతినగర్ ప్రాంతంలో రెండు వర్గాలు రెండు రోజుల కిందట గొడవకు దిగాయి. దీంతో ఈ రెండు వర్గాల్లో ఉన్న నలుగురిని సబ్ ఇన్స్ పెక్టర్ ధరణిబాబు పోలీసు స్టేషన్ కు పిలిచారు. ఈ సమయంలో వారిని కొట్టారు. 

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ?

వీరిలో ఓ 17 సంవత్సరాల బాలుడు మహబూబ్‌బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు బాలుడికి చికిత్స అందించారు. ఇద్దరు కొట్టుకుంటుండగా వారిని సముదాయించేందుకు తాను ప్రయత్నించానని, దీంతో పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చి కొట్టారని బాధితుడు పేర్కొన్నాడు. ఆ గొడవకు తనకు సంబంధం లేదని తాను చెప్పానని, అయినా పోలీసులు వినలేదని ఆరోపించాడు. 

ఈద్ రోజు మసీదుల వెలుపల నమాజ్ చేశారని 2 వేల మందిపై కేసులు.. యూపీలోని అలీగఢ్ పోలీసుల అభియోగాలు

కాగా.. వారం రోజుల కిందట ఓశాంతినగర్ లో రెండు వర్గాలు గొడవకు దిగాయని, వారిని పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని సీఐ ఆనందరావు తెలిపారు. అయితే మళ్లీ గత బుధవారం రాత్రి ఓ వర్గానికి చెందిన వ్యక్తులు గొడపకు దిగారని చెప్పారు. వారిని మరుసటి రోజు పోలీసు స్టేషన్ కు పిలిపించామని పేర్కొన్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని తెలిపారు. 
 

click me!