
న్యూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అధికారులు షాకిచ్చారు. ట్రిపుల్ ఐటీలో అఖరి సంవత్సరం చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన ధ్రువపత్రాలను అధికారులు నిలిపివేశారు. శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు క్యాంపస్‌లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తంగా నాలుగు వేల మంది విద్యార్థులకు అధికారులు ధ్రువపత్రాలను నిలిపివేశారు. అయితే విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లించకపోవడంతో.. ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యార్థుల ధ్రువపత్రాలను నిలిపివేసినట్టుగా తెలుస్తోంది.
అయితే ధ్రువపత్రాల నిలిపివేతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆఖరి సంవత్సర విద్యార్థులు పూర్తి బకాయిలను ఈరోజు సాయంత్రంలోగా చెల్లించకపోతే బయటకు అనుమతించేది లేదని అధికారుల చెబుతున్నట్టుగా విద్యార్థులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆందోళను దిగారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.