దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నిక నిర్వహణపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలు తమకు అందలేదని అధికారులు చెబుతున్నారు.దీంతో ఏం జరుగుతోందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గుంటూరు: గుంటూరు జిల్లా duggirala mpp ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై టీడీపీ ap high court ఆశ్రయించింది. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే హైకోర్టు స్టే ఇచ్చిన ఉత్తర్వులు తమకు అందలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏం జరుగుతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
also read:దుగ్గిరాలలో కొనసాగుతున్న సస్పెన్స్: మరోసారి ఎంపీపీ ఎన్నిక వాయిదా.. ‘‘కింగ్‌మేకర్’’గా జనసేన సభ్యుడు
undefined
దుగ్గిరాల ఎంపీపీ పదవికి షేక్ జబీన్ ను tdp ప్రకటించింది. జబీన్ కుల ధృవీకరణ పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. ఎంపీపీ ఎన్నిక నిర్వహణకు గాను వారం రోజుల గడువును విధించింది.
దుగ్గిరాల మండలంలో టీడీపీ 9 ఎంపీటీసీలను, ycp 8 ఎంపీటీసీలు, jana sena 1 స్థానాన్ని కైవసం చేసుకొంది.ఈ ఎంపీపీ పదవిని బీసీలకు రిజర్వ్ చేశారు. టీడీపీ నుండి విజయం సాధించిన shaik jabin కు కుల ధృవీకరణ పత్రం ఇవ్వడంలో ఆలస్యం చేశారని ఆ పార్టీ ఆరోపణలు చేసింది.
ఇప్పటికే రెండు దఫాలు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికనక వాయిదా పడింది. ఇవాళ కూడ ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించిందని టీడీపీ చెబుతుంది. అయితే ఈ ఆదేశాలు తమకు అందలేదని అధికారులు చెబుతున్నారు.
హైకోర్టు స్టే ఎత్తివేయలని వైసీపీ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని సమాచారం.ప్రొసీడింగ్ ఆఫీసర్ రామ్ ప్రసన్న పై తెలుగుదేశం అభ్యర్థి కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేయాలని భావిస్తున్నారని తెలిసింది.