ప్రేమలో విఫలం.. పెద్దాపురంలో ఒడిశా యువతి ఆత్మహత్య

Published : Apr 17, 2020, 07:50 AM IST
ప్రేమలో విఫలం.. పెద్దాపురంలో ఒడిశా యువతి ఆత్మహత్య

సారాంశం

సహచర ఉద్యోగితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపానికి గురైన పద్మ ఫాక్యరీలోనే విధుల్లో ఉండగానే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది .


బతుకు దెరువు కోసం ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ వలస వచ్చారు. ఇక్కడే ఏదో ఓ పని చేసుకుంటూ జీవితాన్ని సాగదీస్తున్నారు. కాగా.. అనుకోకుండా ఒడిశా యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానిక పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన మాడపల్లి పద్మ (24) ఈ పరిశ్రమలో కార్మికురాలు. సహచర ఉద్యోగితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపానికి గురైన పద్మ ఫాక్యరీలోనే విధుల్లో ఉండగానే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది .

పద్మ అక్కడికక్కడే మృతి చెందగా ఈ ఘటనను చూసిన ఒడిశాకు చెందిన సహచర యువతులు సోనాలి, మనీషా, గంగీలు అపస్మారక స్థితిలోకి చేరారు. దీంతో స్థానికులు వారిని పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న ఎస్సై వి,సురేష్‌  మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్