బెయిల్ మీద విడుదలైన గంటలకే నూతన్ నాయుడి భార్య అరెస్టు

Published : Oct 09, 2020, 07:16 AM IST
బెయిల్ మీద విడుదలైన గంటలకే నూతన్ నాయుడి భార్య అరెస్టు

సారాంశం

సినీ నిర్మాత నూతన్ నాయుడి భార్య మధుప్రియను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. శిరోముండనం కేసులో అరెస్టయిన మధుప్రియ బెయిల్ మీద విడుదలయ్యారు. విడుదలైన కొద్ది గంటలకే మధుప్రియను పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖపట్నం: సినీ నిర్మాత నూతన్ నాయుడి భార్య మధుప్రియను పోలీసులు మళ్లీ అరెస్టు చేశఆరు బెయిల్ మీద విడుదలైన కొద్ది గంటలకే ఆమెను పోలీసులు అరెస్టు చేశఆరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి మధుప్రియ రూ.25 లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.

దాంతో మధుప్రియపై పోలీసులకు ఫిర్యుదు చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. ఇదిలావుంటే, విశాఖపట్నం సుజాత్ నగర్ లోని నూతన్ నాయుడి ఇంట్లో ఆగస్టు 20వ తేదీన ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. 

నూతన్ నాయుడి నివాసంలో గిరిప్రసాద్ నగర్ కు చెందిన శ్రీకాంత్ పనిచేసి మానేశాడు. ఆ ఇంటికి వచ్చిన బ్యుటిషియన్ సెల్ ఫోన్ హ్యాక్ చేసి అసభ్యంగా ప్రవర్తివంటూ శ్రీకాంత్ ను భద్రతా సిబ్బంది, నూతన్ నాయుడి భార్య దుర్భాషలాడారు. అతనికి శిరోముండనం చేశారు.

శిరోముండనం ఘటనపై శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశఆరు ఈ కేసులో మధుప్రియ, నూతన్ నాయుడులతో పాటు మరింత మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?