ప్లూటు బాబు ముందు ఊదు జ‌గ‌నన్న ముందు కాదు... తేడాలోస్తే దబిడి దిబిడే: బాలయ్యకు రోజా కౌంటర్

By Arun Kumar PFirst Published Sep 25, 2022, 7:49 AM IST
Highlights

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిగా మార్చడంపై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బాలయ్య కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. 

అమరావతి : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ జగన్ సర్కార్ తీసుుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. స్వయంగా డాక్టర్ అవడమే కాదు సీఎంగా రాష్ట్రంలోని నిరుపేదలకు ఉచిత వైద్యం అందించేందుకు కృషిచేసిన దివంగత వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం కరెక్టేనని అధికార వైసిపి సమర్దించుకుంటుంటే... మహనీయుడు ఎన్టీఆర్ పేరును తొలగించడమేంటని ప్రతిపక్ష టిడిపి తప్పుబడుతోంది. ఈ విషయమై వైసిపి, టిడిపి నాయకులకు మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. 

 హెల్త్ యూనివర్సిటీకి తన తండ్రి పేరు తొలగించడంపై  ఎన్టీఆర్ తనయుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించగా తాజాగా మంత్రి రోజా ఆయనకు కౌంటరిచ్చారు. బాలకృష్ణ డైలాగ్ నే వాడుతూ ఆయనకే సెటైర్లు వేసారు మంత్రి. ''బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు... జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం... తేడా వస్తే దబిడి దిబిడే..!!'' అంటూ బాలకృష్ణకు రోజా కౌంటరిచ్చారు. 

Read More  ఎన్టీఆర్ కుమారులు పరమశుంఠలు.. బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్‌: మంత్రి జోగి రమేష్ సంచలన కామెంట్స్

అంతకుముందు సీఎం జగన్ తో పాటు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేవలం యూనివర్సిటీకి పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ ఖ్యాతి తగ్గదని... ఆయనను ప్రజల మనసుల్లోంచి చెరిపివేయలేరని అన్నారు. మహనీయుడి పేరుమార్చిన మిమ్మల్సి మార్చడానికి ప్రజలు సిద్దంగా వున్నారని బాలయ్య పేర్కొన్నారు.  

''మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు... ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి (వైఎస్సార్) గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు... కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త...'' అంటూ సీఎం జగన్ కు బాలయ్య  హెచ్చరించారు. 

''వైసిపిలో ఆ మహనీయుడు (ఎన్టీఆర్) పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు... పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్... శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..'' అంటూ టిడిపిలోంచి వైసిపిలో చేరిన కొందరు నాయకులపై  బాలయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఇలా సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్సార్ పైనే కాదు వైసిపి నాయకులపై విరుచుకుపడ్డ బాలయ్యకు ఇప్పటికే మంత్రి జోగి రమేష్ కూడా కౌంటరిచ్చారు. బాలకృష్ణకు పునర్జన్మ ఇచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అని మంత్రి పేర్కొన్నారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ పేరిట సీఎం జగన్ ఓ జిల్లానే ఏర్పాటుచేసారని గుర్తుచేసారు. కాబట్టి బాలకృష్ణ దివంగత వైఎస్సార్ తో పాటు ఆయన తనయుడు జగన్ కు రుణపడి వున్నారని జోగి రమేష్ అన్నారు. 

సినిమాల్లోనే బాలకృష్ణ డైలాగులు చెబుతాడని... బయటమాత్రం దద్దమ్మ అంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బాలకృష్ణ ఒక్కడే కాదు ఎన్టీఆర్ కొడుకులంతా పరమశుంఠలని మండిపడ్డారు.  తండ్రి ఎన్టీఆర్ ను కూలదోసి చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకుంటే వీరంతా ఏం చేసారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. 

click me!