
కృష్ణా: మనిషి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అప్పటి ఆ వ్యక్తి ఆర్థిక స్థితి ప్రభావితం చేస్తుందని ఓ మేధావి చెప్పినట్టు.. చాలా మంది విషయాల్లో అది నిక్కచ్చిగా కనిపిస్తుంది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడి చేతిలో చిల్లి గవ్వ లేదు. ఎంబీఏ చదివాడు. కానీ, ఉద్యోగం(Job) ఇంకా రాలేదు. పెళ్లి వయసుకు వచ్చాడు. పెళ్లి(Marriage) సంబంధాలు చూస్తూనే ఉన్నా.. కుదరడం లేదు. ఇప్పటికీ ఉద్యోగ వెతుకులాటలో ఆర్థిక అవసరాలకు తల్లి కష్టం మీదే ఆధారపడుతున్నాడు. కొడుకును ఎంబీఏ చదివించడానికి ఆమె ఎంతో కష్టపడింది. ఇవన్నీ చూస్తున్నా ఆ యువకుడి మనసులో న్యూనత మొదలైంది. తల్లి ఆవేదనను చూసి తల్లడిల్లాడు. కానీ, వీటన్నింటిని చూసి ఆయన ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రాణాన్ని తీసుకుని(Suicide) కుటుంబాన్ని విషాదంలో ముంచాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన ఓ వీడియో రికార్డు చేసి ఆత్మహత్య గురించి మాట్లాడాడు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని గుంటుపల్లికి చెందిన ప్రసాద్ అనే యువకుడు కష్టపడి చదువుకున్నాడు. ఎంబీఏ చదివాడు. కానీ, ఉద్యోగం అంత సులువుగా రాలేదు. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం తర్వాతే ఆయన సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు.
‘గత వారం రోజులుగా నాకు చాలా బాధగా ఉన్నది. ఎందుకో తెలియదు. ఏమైందో తెలియదు. ఎవరికి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఎవరి వల్లా నాకు ప్రాబ్లమ్స్ లేవు. నేను అందరితోనూ కలిసే ఉంటున్నాను. కానీ, నా జీవితంలో ఇక ముందు తీసుకునే నిర్ణయం కేవలం నాకు స్వతహాగా తీసుకునేదే. అందులో ఎవరికీ బాధ్యత లేదు. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పా.. ఒప్పా.. అనేది నాకు మాత్రమే వర్తిస్తుంది. నేను ఎవరినీ బాధ పెట్టాలనుకోవడం లేదు. నా నిర్ణయాలు నావే’ అని సెల్ఫీ వీడియోలో ప్రసాద్ పేర్కొన్నాడు.
నాకు వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఉన్నాయి. డబ్బు సమస్య ఉన్నది. నాకు మ్యాచెస్ చూస్తున్నారు. మూడేళ్లుగా సంబంధాలు చూస్తున్నా కుదరట్లేదు. దీంతో మా అమ్మ ఎంతో బాధ పడుతున్నారు. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. కానీ, మంచి జాబ్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా ఉద్యోగం చేయటం లేదు. ఇప్పుడు కూడా నా ఉద్యోగం కోసం అమ్మతో పనులు చేయిస్తున్నాను. ఇలా అనేక విషయాల్లో నేను అప్‌సెట్ అయ్యాను. నేను ఏం చేసుకున్నా.. దానితో ఎవరికీ సంబంధం లేదు.