Actor Ali: అతిత్వరలో పార్టీ ఆఫీస్ నుండి శుభవార్త వస్తుంది: సినీనటుడు అలీ

Published : Feb 15, 2022, 05:42 PM ISTUpdated : Feb 15, 2022, 05:52 PM IST
Actor Ali: అతిత్వరలో పార్టీ ఆఫీస్ నుండి శుభవార్త వస్తుంది: సినీనటుడు అలీ

సారాంశం

Actor Ali:  ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత అలీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తో  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. జగన్‌ అలీకి రాజ్యసభ సీటు ఇవ్వ‌నున్నార‌నే నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.   

Actor Ali: ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత అలీ ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు సీఎంతో అలీ సమావేశం అయ్యారు. అయితే..  అలీకి రాజ్యసభ సీటును ఇస్తున్నార‌నే ప్రచారం జ‌రుగుతున్న త‌రుణంలో వీరి భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే.. గ‌త‌వారం టాలీవుడ్‌ సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్‌ను కలిసిన సినీ సెల‌బ్రెటీల‌ల్లో అలీ ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ స‌మ‌యంలోనే అలీని, మరోసారి కలవాలంటూ సీఎం జగన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అలీ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ తో సమావేశమయ్యారు. 
 .   
భేటీ అనంత‌రం అలీ మీడియాతో మాట్లాడారు. త‌న‌ని నేడు రమ్మని పిలిచారని, అతిత్వరలో పార్టీ ఆఫీస్ నుండి శుభవార్త వస్తుందని తెలిపారు. కానీ,ఏమిస్తారో నాకు చెప్పలేదని అన్నారు. తానే ఎప్పుడు పదవులు ఆశించకుండా పార్టీకి పని చేశాన‌నీ, జగన్ తో నాకు చాలా పాత పరిచయం ఉందని తెలిపారు.

వైస్సార్ ఉన్నప్పటి నుండి జగన్ నాకు తెలుసనీ, ఇటీవల త‌న పెళ్లి రోజున రావాలని అనుకున్నామ‌నీ, కానీ కుదరలేదనీ అన్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్నారు కానీ, స‌మ‌యం తక్కువ ఉండడంతో వద్దని అన్నానని తెలిపారు. ఎమ్మెల్యే అంటే గ్రౌండ్ నుండి వర్క్ చెయ్యాలి. కేవ‌లం ఫేస్ వ్యాల్యూ బట్టి అవ్వదని అన్నారు. నేడు జ‌రిగిన  భేటీ పూర్తిగా వ్యక్తిగత భేటీన‌ని అన్నారు. సినీ ప్రముఖులని అవమాన పరచాల్సిన అవసరం జగన్ కి ఏముందని, సినీ ప్రముఖులకు ఇవ్వాల్సిన గౌరవం సీఎం జగన్ ఇస్తున్నారని, గౌరవం ఇవ్వలేదని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

చిన్న పెద్ద సినిమాలకు ఇబ్బంది లేకుండా.. ప్రజలకు ఇబ్బంది లేకుండా సీఎం నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇదిలా ఉంటే త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఉన్న మైనార్టీ అభ్యర్థిగా అలీని నియ‌మిస్తార‌ని టాక్. ఈ క్ర‌మంలో  జ‌గ‌న్ .. అలీ వైపే ఆస‌క్తి చూపుతున్న‌ట్టు టాక్.

"

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?