మోడీపై అవిశ్వాసం: జగన్ సేఫ్, ఆ నలుగురు ఎంపీలు ఎలా...

First Published Jul 18, 2018, 1:03 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం విషయంలో సురక్షితంగా బయటపడ్డారు. ప్రత్యేక హోదా కోసం చేసిన ఐదుగురు వైసిపి ఎంపీల రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు.

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం విషయంలో సురక్షితంగా బయటపడ్డారు. ప్రత్యేక హోదా కోసం చేసిన ఐదుగురు వైసిపి ఎంపీల రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. దీంతో అవిశ్వాసంపై లోకసభలో తన వైఖరిని వెల్లడించాల్సిన అనివార్యత నుంచి ఆయన బయటపడ్డారు. 

బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ జగన్ పై తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ స్థితిలో ఆయన అవిశ్వాసానికి వ్యతిరేకంగా తన వైఖరిని వెల్లడిస్తే రాజకీయంగా జగన్ కు చిక్కులు ఎదురయ్యే పరిస్థితి. అవిశ్వాసానికి మద్దతు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కునే వ్యూహానికి ఎదురు దెబ్బ తగిలి ఉండేది.

ఈ స్థితిలో ఎంపీల రాజీనామాల ఆమోదం ఆయనను గట్టెక్కించినట్లే చెప్పాలి. కాగా, తెలుగుదేశంలోకి ఫిరాయించిన నలుగురు వైసిపి ఎంపీలు అవిశ్వాసానికి మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. 

ఆ నలుగురు ఎంపీలు కూడా అధికారికంగా వైసిపి ఎంపీలుగానే కొనసాగుతున్నారు. దాన్ని పరిగణనలోకి తీసుకునే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన బుట్టా రేణుకను వైసిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పరిగణించి అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించారు. దాన్ని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.

click me!