ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు కాల పరిమితి లేదు: సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

First Published Jul 12, 2018, 7:19 PM IST
Highlights

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు కాలపరిమితి  లేదని కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టేలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో 

స్పష్టం చేసింది.

అమరావతి: ఏపీలో హైకోర్టు ఏర్పాటు విషయంలో తుది గడువు లేదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈమేరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్యం  అఫిడవిట్ దాఖలు చేసింది. 

విభజన చట్టంలో  10 ఏళ్లు ఉమ్మడి రాజధాని  హైద్రాబాద్ ఉన్న విషయాన్న అఫిడవిట్‌లో ప్రస్తావించింది.   హైకోర్టు ఏర్పాటు చేసేందుకు భవనాలు మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉమ్మడి హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని ఆ అఫిడవిట్ లో కేంద్ర న్యాయ శాఖ అభిప్రాయపడింది. భవనాలు, మౌళిక వసతులు కల్పిస్తే ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఆ అఫిడవిట్‌లో న్యాయశాఖ స్పష్టం చేసింది.

అయితే హైకోర్టును విభజించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై పలు మార్లు కేంద్రాన్ని కోరింది.  అయితే  హైకోర్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌళిక వసతులను కల్పించాల్సిన అవసరాన్ని సంబంధిత శాఖాధికారులు గుర్తు చేశారు.

ఉమ్మడి హైకోర్టును విభజించకపోతే తమకు నష్టం వాటిల్లుతోందనే అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. రెండు రాష్ట్రాలు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ అభిప్రాయపడుతోంది.

click me!