ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: వైసీపీ ఎంపీల ప్రశ్నకు కేంద్రం సమాధానం

By narsimha lodeFirst Published Mar 21, 2023, 5:09 PM IST
Highlights

ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం  మరోసారి స్పష్టత ఇచ్చింది.  ప్రత్యేక  హోదా ముగిసిన  అధ్యాయమని  కేంద్రం తేల్చి  చెప్పింది.  
 

అమరావతి:  ప్రత్యేక హోదా ముగిసిన  అధ్యాయమని కేంద్రం  ప్రకటించింది.   ప్రత్యేక హోదాపై  వైసీపీ ఎంపీలు  అడిగిన  ప్రశ్నకు  మంగళవారంనాడు  కేంద్ర ప్రభుత్వం  సమాధానం ఇచ్చింది.  14వ ఆర్ధిక  సంఘం సిఫారసుల మేరకు  నిర్ణయం తీసుకున్నట్టుగా  చెప్పారు.  

ఏపీ రాష్ట్ర  ఆర్ధికలోటు భర్తీకి  నిధులు  కేటాయించినట్టుగా  కేంద్రం తెలిపింది.  ప్రత్యేక  హోదాకు బదులు  ఏపీకి ప్రత్యేక  ప్యాకేజీ  ప్రకటించినట్టుగా  కేంద్రం  వివరించింది.  2015-18 మధ్య  ఏపీ  పథకాలకు  తీసుకున్న రుణాలపై  వడ్డీ చెల్లించినట్టుగా  కేంద్రం తెలిపింది.  

ఏపీ పునర్విభజన చట్టం  ప్రకారంగా  ఏపీకి  ప్రత్యేక హోదా కల్పించింది. అయితే  2014లో  ఏపీలో  చంద్రబాబు  సీఎంగా  ఉన్నారు.  ఆనాడు  కేంద్రంలో  అధికారంలో  ఉన్న మోడీ సర్కార్  ప్రత్యేక హోదాకు  సమానమైన  ప్రత్యేక  ప్యాకేజీని  కేంంద్రం ప్రకటించింది.  ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక  ప్యాకేజీని చంద్రబాబు  ఒప్పుకున్నారు.  ఈ విషయమై  చంద్రబాబు సర్కార్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

 తమ పార్టీకి  25 ఎంపీలను  గెలిపిస్తే  కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకువస్తామని  వైసీపీ  ప్రకటించింది.  2019  ఎన్నికల సమయంలో  ప్రత్యేక హోదా పై  పార్టీలు హామీలు  ఇచ్చాయి.  అయితే వైసీపీకి  22 మంది  ఎంపీలు,  151 మంది  ఎమ్మెల్యేలను ప్రజలకు కట్టబెట్టారు. కానీ  కేంద్రంలో  మోడీ సర్కార్  కు సంపూర్ణ మెజారిటీ ఉంది.  మిత్రపక్షాలు, ఇతర పార్టీలపై  ఆధారాపడాల్సిన  అవసరం మోడీకి  లేకుండా  పోయింది.

దీంతో  ప్రత్యేక హోదాపై   కేంద్రంపై  గట్టిగా  ఒత్తిడి తీసుకువచ్చినా  ఫలితం లేదనే అభిప్రాయంతో  వైసీపీ  నేతలు న్నారు.  కేంద్రంలో  అధికారంలో ఉన్న పార్టీకి  సంపూర్ణ మెజారిటీ లేకపోతే  ఇతర  పార్టీలపై  ఆధారపడాల్సిన  పరిస్థితులు వస్తే  ప్రత్యేక హోదా  అంశాన్ని  అమలు  చేసుకొనే అవకాశం ఉంటుందని  వైసీపీ  నేతలు  చెబుతున్నారు. వైసీపీకి  22 మంది ఎంపీలను  కట్టబెట్టినా  కూడా  ప్రత్యేక హోదాపై  ఆ పార్టీ ఏం చేసిందని  విపక్షాలు  ప్రశ్నిస్తున్నాయి. 

click me!