ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లే: పార్లమెంట్ సాక్షిగా కుండబద్ధలు కొట్టిన కేంద్రం

By Siva KodatiFirst Published Feb 3, 2020, 3:05 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి కుండబద్ధలు కొట్టింది. పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి కుండబద్ధలు కొట్టింది. పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు.

ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వరాదంటూ 14వ ఆర్ధిక సంఘం సిఫారసు మేరకు ఏపీకి కూడా ఇవ్వడం కుదరదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

Also Read:ఎప్పుడో చెప్పాం: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చేసిన జీవీఎల్

కాగా ఏపీకి హోదా అనేది ముగిసిన అధ్యాయమని ఎప్పుడో చెప్పామన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరిసింహారావు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించి ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.

రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని.. జమ్మూకాశ్మీర్, లడఖ్‌లకు ఇచ్చినట్లే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చామని జీవీఎల్ గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రప్రభుత్వం నాబార్డు ద్వారా నిధులు అందజేస్తుందని నరసింహారావు వెల్లడించారు.

Also Read:టీడీపీ, వైసీపీలను అడగండి: ప్రత్యేక హోదాపై పవన్

రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకే బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. అయితే ఏపీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రతిపాదనలు రాలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం చేసిన ఖర్చుకు సంబంధించిన యూసీలు ఇంకా ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. 

click me!