హరిజన,గిరిజన, కుల వృత్తులకు ఉచిత విద్యుత్ కొనసాగింపు: ఏపీ ఈఆర్‌సీ

By narsimha lode  |  First Published Mar 31, 2021, 4:35 PM IST

వచ్చే ఆర్ధిక సంవత్సరానికి కొత్త టారిఫ్ ను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి బుధవారం నాడు ప్రకటించింది.



విశాఖపట్టణం: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి కొత్త టారిఫ్ ను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి బుధవారం నాడు ప్రకటించింది.సగటు యూనిట్ ధరను రూ.7.17 నుండి రూ. 6.37కి తగ్గించినట్టుగా తెలిపింది. ఈ మేరకు కొత్త టారిఫ్ వివరాలను ఈఆర్‌సీ ఛైర్మెన్ జస్టిస్ నాగార్జునరెడ్డి వెల్లడించారు.

బుధవారం నాడు ఆయన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.వివిధ సంఘాల సూచనల మేరకు టారిఫ్ పై నిర్ణయం తీసుకొన్నామన్నారు. ఇకపై గృహ వినియోగదారుడిపై కనీస చార్జీలు ఉండవన్నారు.

Latest Videos

undefined

కనీస ఛార్జీల స్థానంలో కిలో వాట్ కు రూ. 10 చెల్లిస్తే చాలని చెప్పారు. ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్ధిష్ట ఛార్జీలు ఉండవని చెప్పారు.పరిశ్రమల కేటగిరిలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చబోమన్నారు. రైతుల ఉచిత విద్యుత్ కు రూ. 7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన వివరించారు.

పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ ను వర్తింపజేస్తామన్నారు.కొత్త టారిఫ్ ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తోందని ఈఆర్‌సీ ఛైర్మెన్ తెలిపారు.హరిజన, గిరిజన, కులవృత్తులకు ఉచిత విద్యుత్తు కొనసాగించనున్నారు. ఈ భారాన్ని ప్రభుత్వం భరించనుంది.
 

click me!