మందుబాబులకు షాక్... సాయంత్రం 6 తర్వాత నో మందు

By telugu teamFirst Published Jul 9, 2019, 11:57 AM IST
Highlights

మందు బాబులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.  మద్యపాన వినియోగాన్ని అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకోనుంది.

మందు బాబులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.  మద్యపాన వినియోగాన్ని అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా సాయంత్రం ఆరు తర్వాత మద్యం దొరకకుండా ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం  రాష్ట్రంలో ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కాగా... అక్టోబర్ నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు చేపట్టాలని భావిస్తున్నారు.

సాయంత్రం అమ్మకాలను నాలుగు గంటలు తగ్గిస్తే అమ్మకాలు పెద్దఎత్తున తగ్గిపోతాయని ప్రభుత్వం భావన. సాధారణంగా మద్యం అమ్మకాలు సాయంత్రం నుంచి రాత్రి వరకే ఎక్కువగా ఉంటాయి. మందుప్రియులు అధికంగా రాత్రే మద్యం తాగుతారు. అందుకే ఆ సమయలో కాస్త కట్టడి చేస్తే... మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నూతన పాలసీ అక్టోబరు నుంచి అమల్లోకి రానున్నందున ప్రభుత్వం పలు రకాల కొత్త ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. 

గతంలో టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను ఇచ్చేవారు. అయితే.. ఇక నుంచి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సిబ్బందిని నియమించనుంది. సిబ్బంది పనిభారం కూడా తగ్గుతందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ నిర్ణయాలు తూచా తప్పకుండా అమలు అయ్యేలా ఎక్సైజ్ శాఖ అధికారులు తమ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రత్యేక నిఘా ఉంచి మరీ.. ఆరు తర్వాత మద్యం అమ్మకాలు జరగకుండా ఉండేలా వారు చూడాల్సి ఉంటుంది. 

click me!