ఏపీలో విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపుపై తేల్చేసిన మంత్రి సురేష్

By narsimha lode  |  First Published Jan 16, 2022, 3:42 PM IST

రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు యోచన లేదని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు. ఆదివారం నాడు మంత్రి మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు.


 

 అమరావతి: Andhra pradesh రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులను పొడిగించే ఆలోచన లేదని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Adimulapu suresh తేల్చి చెప్పారు.ఆదివారం నాడు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.

Latest Videos

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల పాటు holidays ఇచ్చింది. ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏపీ రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలతో పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. ఈ నెల 17 నుండి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో corona కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారానికి ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెక్ పెట్టారు. రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే ఆలోచన లేదని ఏపీ మంత్రి సురేష్ తేల్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 17 నుండి 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అయితే తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీ రాస్ట్రంలో కూడా విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారానికి మంత్రి సురేష్ పుల్‌స్టాప్ పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం నాడు రాష్టంలో 4 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కోడి పందెలు, గుండాటలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈ నెల 10వ తేదీ నుండే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. అయితే సంక్రాంతిని పురస్కరించుకొని ఈ నెల 18 నుండి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను నైట్ కర్ఫ్యూతో పాటు మరికొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు.50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌, మాల్స్ ఓపెన్ చేయనున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని జగన్ సర్కార్ ఆదేశించింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు పోలీసులకు సూచించారు.మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలన్నారు. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలన్నారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదని ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

 ఏపీలో శనివారం నాడు 4,955 కరోనా కేసలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,01,710కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో విశాఖ, చిత్తూరు జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. విశాఖ జిల్లాలో 1,103 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,039 కేసులు నమోదైనట్టుగా ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా కరోనాతో ఒకరు మరణించగా మొత్తం మరణాల సంఖ్య 14,509కి చేరింది. తాజాగా రాష్ట్రంలో కరోనా నుంచి 397 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 20,64,331కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,870కి పెరిగింది. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు 13.87 శాతం నమోదవుతోంది.


 


 

click me!