సీఐడీ కస్టడీ సమయంలో అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబును ప్రశ్నించారు.
అమరావతి: కస్టడీ సమయంలో విచారణలో అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని చంద్రబాబును ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును రెండు రోజుల సీఐడీ కస్టడీ ఆదివారం నాడు సాయంత్రం పూర్తైంది. సీఐడీ కస్టడీ పూర్తైన తర్వాత చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు వర్చువల్ గా హాజరుపర్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మాట్లాడారు. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా అని చంద్రబాబును జడ్జి అడిగారు. వైద్య పరీక్షలు చేయించారా అని చంద్రబాబును జడ్జి ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు జడ్జి దృష్టికి తీసుకు వచ్చారు.
also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు రిమాండ్ అక్టోబర్ 5 వరకు పొడిగింపు
మీ మీద ఉన్నవి అభియోగాలే అని మొన్న చెప్పాను.. ఇవాళ కూడ చెబుతున్నట్టుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుతో చెప్పారని సమాచారం. పోలీసుల కస్టడీలో లేరు... కోర్టు కస్టడీలో ఉన్నారని చంద్రబాబుకు జడ్జి చెప్పారు. అయితే ఈ కేసులో తనను ఇరికించారని చంద్రబాబు జడ్జికి తెలిపారు.తాను నేరం చేయలేదని చంద్రబాబు న్యాయమూర్తి దృష్టికి తీసుకు వచ్చారు. అయితే మీరు పోలీసుల కస్టడీలో లేరు... జ్యూడీషీయల్ కస్టడీలో ఉన్నారని జడ్జి గుర్తు చేశారు. మీపై అభియోగాలు మాత్రమే వచ్చాయని జడ్జి ప్రస్తావించారు.