సీఎంతో విబేధాలపై తేల్చేసిన గంటా

First Published Jul 6, 2018, 1:02 PM IST
Highlights

సీఎంతో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఏపీ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. భీమిలీ సీటు విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు.  ఇవాళ జరిగే కేబినేట్ సమావేశానికి హాజరుకానున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.


అమరావతి:తనకు సీఎం చంద్రబాబునాయుడకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని  ఏపీ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.శుక్రవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తనకు సీఎంకు మధ్య విబేధాలున్నాయని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమే అంటూ ఆయన కొట్టిపారేశారు.

భీమిలి సీటు విషయంలో కూడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవని ఆయన చెప్పారు. మీడియాలో ఈ విషయమై తప్పుడు ప్రచారం సాగుతోందని ఆయన చెప్పారు. ఇవాళ జరిగే కేబినేట్ సమావేశానికి తాను హజరౌతానని ఆయన ప్రకటించారు. గత కేబినేట్ సమావేశానికి గంటా శ్రీనివాసరావు హజరుకాలేదు. 

 డిఎస్సీ నోటీఫికేషన్‌ను వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.ఆర్థిక శాఖ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో   ఈ విషయమై డీఎస్సీ నోటీఫీకేషన్ విడుదల చేయకుండా నిలిపివేస్తున్నట్టు ఆయన చెప్పారు. డీఎస్సీ నోటీఫీకేషన్ ను వారం రోజుల్లో విడుదల చేసేలా  అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టు ఆయన చెప్పారు. 

ఇటీవల ఓ పత్రికలో ప్రచురించిన  సర్వేకు సంబంధించిన సమాచారంపై తీవ్ర మనస్థాపానికి గురైన  గంటా శ్రీనివాసరావు గత కేబినేట్ సమావేశానికి హజరుకాలేదు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడ దూరంగా ఉంటూ వచ్చారు.  ఈ పరిస్థితుల్లో గత మాసంలో విశాఖ జిల్లా పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా జిల్లా ఇంచార్జీ మంత్రి  నిమ్మకాయల చినరాజప్ప మధ్యవర్తిత్వం ఫలించింది. 

గంటా శ్రీనివాసరావుతో చేసిన చర్యలు ఫలించాయి.ఈ చర్చలు ఫలవంతం కావడంతో సీఎం కార్యక్రమంలో గంటా పాల్గొన్నారు. ఆ రోజు నుండి  మంత్రి గంటా విధులకు హాజరౌతున్నారు.  గత కేబినేట్ సమావేశానికి హాజరుకాకున్నా.. ఇవాళ జరిగే కేబినేట్ సమావేశానికి తాను హాజరుకావాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.


 

click me!