తగ్గేదే లేదు: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదన్న కేంద్రం

Published : Mar 13, 2023, 04:34 PM IST
 తగ్గేదే లేదు: విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణపై  పునరాలోచన లేదన్న కేంద్రం

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ విషయంలో  పునరాలోచన లేదని  కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

న్యూడిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ  విషయంలో పునరాలోచన లేదని   కేంద్ర ప్రభుత్వం స్పష్టం  చేసింది. టీడీపీ ఎంపీ కనకమేడల  రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు  కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి  రాతపూర్వకంగా  సమాధానం ఇచ్చారు. 

విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  ఉద్యోగులు, కార్మికులు  పెద్ద ఎత్తున  ఆందోళనలు  నిర్వహిస్తున్న విషయాన్ని   టీడీపీ ఎంపీ కనకమేడల  రవీంద్రకుమార్ గుర్తు  చేశారు.  విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ విషయంలో  తమ వైఖరిలో  మార్పు లేదని  కేంద్రం తేల్చి చెప్పింది.  స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన కూడా చేయడం లేదని  కూడా  కేంద్ర మంత్రి  స్పష్టం  చేశారు.  ఆందోళన  చేస్తున్న ఉద్యోగులు, కార్మికులతో  విశాఖ స్టీల్ ప్లాంట్  యాజమాన్యం సంప్రదింపులు జరుపుతుందని  కూడా కేంద్ర మంత్రి  స్పష్టం  చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  కార్మిక సంఘాల  జేఎసీ  ఆధ్వర్యంలో   ఆందోళనలు  సాగుతున్నాయి.  
 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం