బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం సాధ్యం కాకపోవచ్చు: టీజీ వెంకటేష్

Published : Apr 04, 2021, 05:07 PM IST
బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం సాధ్యం కాకపోవచ్చు: టీజీ వెంకటేష్

సారాంశం

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం సాధ్యం కాకపోవచ్చని  బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ చెప్పారు.


తిరుపతి: వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం సాధ్యం కాకపోవచ్చని  బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ చెప్పారు.

ఆదివారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. ఎవరు ముఖ్యమంత్రి అనే అంశం గతంలో లేదని ఒకపై ఈ అంశం కీలకం కానుందన్నారు. ఈ కారణం చేత టీడీపీ, బీజేపీలు కలిసే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.వైసీపీ ఆలయాల పవిత్రతను దెబ్బతీసోందన్నారు. వైసీపీలో ఉన్న హిందూ ఓటర్లు బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి  పొత్తు ఉంటుందని  ఈ రెండుపార్టీలు ప్రకటించాయి. తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్ధికి జనసేన మద్దతు ప్రకటించింది.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీజేపీ కంటే జనసేన ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu